Kavya Kalyanram: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్

‘గంగోత్రి’ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి రోల్ పోషించిన కావ్య కళ్యాణ్ రామ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆమె హీరోయిన్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వచ్చిన ‘బలగం’ చిత్రంతో ఆమె మంచి పేరు సంపాదించుకుంది. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమాలో ‘పొట్టి పిల్లా’ అనే పాట ఈమె ఇమేజ్ ను ఇంకా పెంచింది అని చెప్పాలి. అంతకు ముందు ‘మసూద’ అనే సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా చేసింది.

అందులో హీరోగా చేసిన తిరువీర్ లవర్ మినీ పాత్రలో ఈమె నటించి మెప్పించింది. హీరోయిన్ గా రెండు సూపర్ హిట్లు కొట్టిన కావ్య కళ్యాణ్ రామ్.. ఇటీవల ‘ఉస్తాద్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కీరవాణి తనయుడు సింహా హీరోగా నటించిన సినిమా ఇది. ‘వారాహి’ వంటి బడా బ్యానర్ పై రూపొందింది. ఆగస్టు 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నూతన దర్శకుడు ఫణి దీప్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

అయితే మొదటి షోతోనే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ నమోదైంది. కథ బాగున్నప్పటికీ కథనం ఆసక్తికరంగా లేకపోవడంతో ఫలితం తేడా కొట్టినట్టు అంతా చెబుతున్నారు. ఈ సినిమా ప్లాప్ అవ్వడం కావ్యకి బాగా మైనస్ అయ్యింది. ఇది కనుక హిట్ అయ్యుంటే.. ఆమె పై సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనే ముద్ర పడుండేది. ఇంకా క్రేజీ ఆఫర్స్ వచ్చుండేవి.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus