Kavya Kalyanram: ‘బలగం’ బ్యూటీ పై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసిన దర్శకులు!

Ad not loaded.

‘వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట’ అంటూ ‘గంగోత్రి’ లో ఆడి పాడిన కావ్య కళ్యాణ్ రామ్ అందరికీ సుపరిచితమే. ఆ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి రోల్ చేసిన ఈమె ఇప్పుడు హీరోయిన్ అయిపోయి రెండు హిట్ సినిమాల్లో కూడా నటించేసింది. ‘మసూద’ ‘బలగం’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి సక్సెస్ లు అందుకుంది. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం రెడీ అవుతుంది. ఆమె కీరవాణి కొడుకు సింహా సరసన నటించిన ‘ఉస్తాద్’ సినిమా ఆగస్టు 12 న విడుదల కాబోతోంది.

‘వారాహి’ బ్యానర్లో రూపొందిన సినిమా కాబట్టి మినిమమ్ గ్యారంటీ అని అంతా భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా కావ్య చేసిన కామెంట్స్ కొన్ని వైరల్ గా మారాయి. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో హీరోయిన్ ఛాన్సుల కోసం ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు ఓ డైరెక్టర్ నువ్వు లావుగా ఉన్నావు .. హీరోయిన్ గా పనికిరావు అంటూ అవమానించినట్టు ఆమె చెప్పుకొచ్చింది. అయినా డిజప్పాయింట్ అవ్వకుండా తన టాలెంట్ ను నమ్ముకుని ఇంతవరకు వచ్చినట్టు కూడా (Kavya Kalyanram) ఆమె తెలిపింది.

గతంలో కూడా చాలా మంది హీరోయిన్లు తమ కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. ఆ లిస్ట్ లో కావ్య కూడా చేరింది. ‘బలగం’ లో కొంచెం పుష్టిగా కనిపించిన ఈమె ఇప్పుడు స్లిమ్ అయ్యి సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు పోస్ట్ చేస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus