‘మిస్ ఇండియా’కి కీర్తి ఎంత తీసుకుందో తెలుసా..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది కీర్తి సురేష్. ‘మహానటి’ సినిమాతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా తరువాత కీర్తి వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా సక్సెస్ కాలేకపోయాయి. ‘పెంగ్విన్’ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కావడంతో మంచి వ్యూస్ ను దక్కించుకుంది. ఈ సినిమాకి కీర్తి మొత్తంగా రూ.2.4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

‘పెంగ్విన్’ తరువాత ‘మిస్ ఇండియా’ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కీర్తి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిసిందే షాక్ అవ్వాల్సిందే. మొత్తం ఆరు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ముందుగా కీర్తి రూ.1.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా.. వీటితో పాటు ఓవరాల్ బిజినెస్ లో తనకు పది శాతం ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకుంది. ఇప్పటివరకు ఈ సినిమాకి రూ.19.4 కోట్ల బిజినెస్ జరగడంతో అందులో పది శాతం అంటే సుమారు రూ.1.9 కోట్లు కీర్తికి ఇచ్చారట.

మొత్తం కలిపి చూస్తే ‘మిస్ ఇండియా’ సినిమాకి గాను కీర్తి రూ.3.4 కోట్లకు పైగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సౌత్ లో నయనతార మాత్రమే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంది. ఇప్పుడు ఈ లిస్ట్ లో కీర్తి సురేష్ కూడా చేరింది. ఇక వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు దెబ్బ కొడుతుండడంతో కొంతకాలం పాటు ఈ తరహా ప్రాజెక్ట్ లను పక్కన పెట్టి.. కమర్షియల్ సినిమాలు చేయాలని నిర్ణయించుకుంది కీర్తి సురేష్.

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus