Keerthy Suresh: కీర్తి సురేష్ కు ఆ సినిమాలు మైనస్ అయ్యాయా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో సర్కారు వారి పాట, భోళా శంకర్, దసరా సినిమాలలో నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాదే ఈ మూడు సినిమాలు రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే తెలుగులో సక్సెస్ రేట్ తక్కువగా ఉన్న అతికొద్ది మంది హీరోయిన్లలో కీర్తి సురేష్ కూడా ఒకరు. మహానటి సినిమాతో దేశమంతటా కీర్తి సురేష్ పేరు మారుమ్రోగింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది. మహానటి సక్సెస్ తో చాలామంది నిర్మాతలు కీర్తి సురేష్ తో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించాలని భావించారు. తమిళంలో నయానతార, తెలుగులో సమంతలా కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటుతారని అభిమానులు భావించారు. అయితే అభిమానుల అంచనాలకు భిన్నంగా కీర్తి సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. కీర్తి సురేష్ నటించిన కొన్ని సినిమాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా చాలామంది సినీ అభిమానులకు తెలియదంటే ఆ సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ ఏంటో సులభంగా అర్థం చేసుకోవచ్చు.

కీర్తి సురేష్ కు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అచ్చిరాలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇకనైనా కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు దూరంగా ఉండాలని లేకపోతే ఆమె కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సోలో హీరోయిన్ గా కీర్తి సురేష్ కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ లేదనే సంగతి తెలిసిందే. గుడ్ లక్ సఖి తొలిరోజు కలెక్షన్లు కేవలం 23 లక్షల రూపాయలు మాత్రమే అంటే ఈ సినిమా రిజల్ట్ ఏంటో సులభంగానే అర్థమవుతుంది.

ఒకవేళ కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఓకే చెప్పినా బలమైన కథ ఉంటే మాత్రమే ఓకే చెప్పాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కీర్తి సురేష్ సర్కారు వారి పాట సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాల్సి ఉంది. ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus