Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి టాపిక్.. ఈసారి ఎలా రియాక్ట్ అవుతుందో..!
- November 16, 2024 / 01:05 PM ISTByFilmy Focus
మలయాళ, తమిళ సినిమాలతో కెరీర్ ను ప్రారంభించిన కీర్తి సురేష్ (Keerthy Suresh).. తెలుగులో ‘నేను శైలజ’ (Nenu Sailaja) ‘నేను లోకల్’ (Nenu Local) వంటి సినిమాల్లో నటించింది. అలాగే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) ..లతో ‘అజ్ఞాతవాసి’ (Agnyaathavaasi) చేసే ఛాన్స్ కూడా దక్కించుకుంది. అయితే ‘మహానటి’ (Mahanati) సినిమా ఈమెను స్టార్ హీరోయిన్ ని చేసింది. ఆ తర్వాత ఈమెకి బోలెడన్ని ఛాన్సులు లభించాయి. అయితే కొత్త పూజా హెగ్డే (Pooja Hegde) , రష్మిక (Rashmika Mandanna), శ్రీలీల (Sreeleela) వంటి హీరోయిన్ల హవా పెరగడం వల్ల కీర్తి సురేష్ వెనుకబడింది.
Keerthy Suresh

అయినా సరే అప్పుడప్పుడు పెద్ద సినిమాల్లో మెరుస్తూనే ఉంది. ‘దసరా’ (Dasara) వంటి సినిమాలతో ఫామ్లోకి వచ్చినప్పటికీ ఎందుకో తెలుగు సినిమాల్లో ఈమె ఎక్కువగా చేయడం లేదు. ప్రస్తుతం హిందీ, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది కీర్తి. ఇదిలా ఉండగా.. ఈమె పెళ్లి టాపిక్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో కేరళకు చెందిన ఓ పొలిటీషియన్ కొడుకుని కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంటుంది అంటూ వార్తలు వచ్చాయి. తర్వాత కీర్తి వాటిని కొట్టి పారేసింది.
ప్రస్తుతం కెరీర్ పైనే ఫోకస్ చేస్తున్నట్టు తెలిపింది. ఆ తర్వాత సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) ని కీర్తి సురేష్ ప్రేమ వివాహం చేసుకోబోతోంది అంటూ ప్రచారం జరిగింది. తర్వాత కీర్తి రియాక్ట్ అయ్యి.. ‘ఈ వార్తలు పుట్టించిన వాళ్లపై జాలేస్తుంది.. అందులో నిజం లేదు’ అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు త్వరలో కీర్తి సురేష్ గోవాలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ చర్చ మొదలైంది. డిసెంబర్లో కీర్తి పెళ్లి సంబరాలు మొదలవుతాయి అని కూడా అంటున్నారు. మరి దీనిపై కీర్తి సురేష్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.













