ధనుష్ (Dhanush) హీరోగా తెరకెక్కుతున్న మరో బైలింగ్యువల్ మూవీ ‘కుబేర’(Kubera). రష్మిక మందన (Rashmika Mandanna) ధనుష్ కి జోడీగా నటిస్తోంది.’లవ్ స్టోరీ’ (Love Story) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని శేఖర్ కమ్ముల (Sekhar Kammula) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ‘ఏషియన్ సంస్థ’ ‘అమిగోస్’ క్రియేషన్స్ తో కలిసి నిర్మిస్తుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఏక కాలంలో తెరకెక్కుతుంది ఈ సినిమా. ఇక ఈరోజు ‘కుబేర’ గ్లింప్స్ ను విడుదల చేశారు.
Kubera Teaser Review:
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ‘కుబేర’ టీజర్ ను కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో లాంచ్ చేయడం జరిగింది. ఈ టీజర్ 53 నిమిషాల నిడివి కలిగి ఉంది. ధనుష్, నాగార్జున (Nagarjuna), రష్మిక వంటి పాత్రలని పరిచయం చేస్తూ ఈ టీజర్ సాగింది. ఎక్కడా ఒక్క డైలాగ్ కూడా లేదు. ‘ధనవంతుడుగా ఉండే హీరో(ధనుష్) డబ్బుని పోగొట్టుకుని.. ఎలా ఫుట్ పాత్ మీదకు వచ్చేశాడు…ఆ తర్వాత ఎలా తిరిగి ధనవంతుడు అయ్యాడు?’ అనే లైన్ తో ఈ సినిమా రూపొందినట్టు తెలుస్తుంది.
ధనుష్ రెండు రకాల లుక్స్ లో కనిపించాడు. నాగార్జున లుక్ కూడా బాగుంది. విలన్ ని కూడా పరిచయం చేశారు. అంతకు మించి ఏ పాత్రకి కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు. మరోపక్క ఈ టీజర్ కి దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచింది. విజువల్స్ కూడా చాలా గ్రాండ్ గా ఉన్నాయి. టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :