Keerthy Suresh: కొత్త కారు కొన్న కీర్తి సురేష్.. ఎన్ని రూ.కోట్లంటే?

  • October 18, 2022 / 12:26 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ మహానటి, సర్కారు వారి పాట సినిమాల విజయాలతో తన రేంజ్ ను పెంచుకున్నారు. సినిమాసినిమాకు కీర్తి సురేష్ కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండగా కీర్తి సురేష్ నటించి వచ్చే ఏడాది రిలీజ్ కానున్న దసరా సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈరోజు కీర్తి సురేష్ పుట్టినరోజు కావడంతో దసరా మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

అయితే కీర్తి సురేష్ తాజాగా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. పుట్టినరోజు సందర్భంగా కీర్తి సురేష్ కొత్త కారును కొనుగోలు చేయడం గమనార్హం. కీర్తి సురేష్ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కెరీర్ తొలినాళ్లలో బొద్దుగా కనిపించిన కీర్తి సురేష్ ప్రస్తుతం స్లిమ్ లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. లగ్జరీ బీఎండబ్ల్యూ కారును కీర్తి సురేష్ కొనుగోలు చేయడం గమనార్హం.

మోడల్ ఎక్స్7 కారును కీర్తి సురేష్ కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ కారు ధర కోటిన్నర రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం. అత్యాధునిక ఫీచర్లతో ఉన్న ఈ కారుకు సంబంధించిన ఫోటోలను కీర్తి సురేష్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. కీర్తి సురేష్ షేర్ చేసిన ఫోటోకు 15 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ కారులో వాయిస్ అసిస్టెంట్ తో పాటు మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఉందని తెలుస్తోంది.

ఈ కారులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కొత్త ఐ డ్రైవ్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరికొన్ని ఫీచర్లు ఉన్నాయి. దసరా సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటానని కీర్తి సురేష్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కీర్తి సురేష్ తర్వాత సినిమాలతో కూడా కెరీర్ బెస్ట్ హిట్లు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కెరీర్ విషయంలో కీర్తి సురేష్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus