Keerthy Suresh: ఆ పాత్రలకు కీర్తి సురేష్ దూరమైనట్టేనా?

నైను శైలజ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన కీర్తి సురేష్ తొలి సినిమాతోనే మంచి పేరును సంపాదించుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ కు మహానటి సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మరోవైపు కీర్తి సురేష్ ఏకంగా మూడు సినిమాల్లో చెల్లి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

తమిళంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న అన్నాత్తే సినిమాలో కీర్తి సురేష్ చెల్లిగా నటిస్తున్నారు. దీపావళి పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పాటు చిరంజీవి హీరోగా వేదాళం రీమేక్ గా తెరకెక్కుతున్న భోళాశంకర్ సినిమాలో కూడా కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సినిమాలో నటిస్తే భారీస్థాయిలో గుర్తింపు వస్తుందని కీర్తి సురేష్ భావిస్తున్నట్టు సమచారం.

పాత్ర నచ్చితే చెల్లెలి పాత్రలకు సైతం కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సెల్వ రాఘవన్ హీరోగా సానికాయిదమ్ పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో కూడా చెల్లిగా నటించడానికి కీర్తి సురేష్ ఓకే చెప్పారు. హీరోయిన్ పాత్రల్లో మాత్రమే నటించకుండా కథ నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి కీర్తి సురేష్ ఓకే చెబుతున్నారు. అయితే కీర్తి సురేష్ చెల్లి పాత్రల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో తెలియాలంటే ఆమె నటించిన సినిమాలు రిలీజయ్యే వరకు ఆగాల్సిందే. వరుసగా చెల్లి పాత్రలలో కీర్తి సురేష్ నటిస్తుండటంతో కీర్తి సురేష్ హీరోయిన్ పాత్రలకు దూరమైనట్టేనా..? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus