కీర్తి సురేష్.. మెగా హీరోలకు షాకులిస్తూనే ఉందిగా..!

  • June 19, 2020 / 09:06 PM IST

మెగా ఫ్యామిలీలో దాదాపు 8 మంది హీరోల వరకూ ఉన్నారు. పవన్ కళ్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో పాటు సాయి తేజ్, వరుణ్ తేజ్ వంటి టైర్2 హీరోలలు.. అలాగే అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్ వంటి టైర్3 హీరోలు కూడా ఉన్నారు. ఇప్పుడు ‘ఉప్పెన’ తో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా మెగా హీరోల లిస్ట్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. మెగా హీరోలతో నటించే ఛాన్స్ వస్తే.. హీరోయిన్లు ఎగిరి గంతేసి ఓకే చెప్పేస్తుంటారు. వాళ్ళ సినిమాలు మినిమం గ్యారెంటీ.. ఎందుకంటే క్రేజీ డైరెక్టర్లు అంతా మెగా కాంపౌండ్ హీరోలతోనే సినిమాలు తీస్తుంటారు.

కాబట్టి.. ఆ హీరోల సినిమాల్లో నటించే అవకాశం వస్తే హీరోయిన్లు అస్సలు వదులుకోరు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అయితే మన మహానటి కీర్తి సురేష్ మాత్రం.. మెగా హీరోలను అస్సలు పట్టించుకోవట్లేదు. కీర్తి సురేష్ కు ముందుగా అల్లు అర్జున్ తో ‘ఐకాన్’ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందట.కానీ అందులో గ్లామర్ డోస్ ఎక్కువగా ఉందని రిజెక్ట్ చేసిందట. తరువాత సాయి తేజ్ సినిమాలో నటించే ఛాన్స్ కూడా కీర్తికి వచ్చిందట.. ఆ ప్రాజెక్ట్ లో తన పాత్రకు ప్రాధాన్యత లేదు అని రిజెక్ట్ చేసిందట.

‘ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.. మితి మీరిన గ్లామర్ షో చెయ్యడానికి నేను రెడీగా లేను.. అలాగే నా పాత్రకు ప్రాధాన్యత లేని సినిమాల్లో కూడా నేను నటించను’ అని తేల్చి చెప్పేస్తుంది కీర్తి సురేష్. ఇక ఈమె నటించిన ‘పెంగ్విన్’ చిత్రం తాజాగా అమెజాన్ లో విడుదలయ్యింది. త్వరలో మహేష్ బాబు, పరశురామ్(బుజ్జి) కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం షూటింగ్ లో కూడా జాయినవ్వబోతుంది కీర్తి సురేష్.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!


Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus