కీర్తి సురేష్.. ఈసారైనా పూర్తి చేస్తుందా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా చేయాలని హీరోలకు పెద్దగా కోరికలు ఉండకపోయినా హీరోయిన్స్ కు మాత్రం గట్టిగానే ఉంటాయి. హిందీ సినిమా మార్కెట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సౌత్ భామలు వీలైనంత వరకు ఆ ఆఫర్స్ వస్తే ఏ మాత్రం వదులుకోరు. అయితే కీర్తి సురేష్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రాబ్లమ్ ఏమిటో గాని గత ఏడాది నుంచి హిందీ ఆఫర్స్ ను చాలానే రిజెక్ట్ చేసిందట. మహానటి సినిమాతో కెరీర్ కు సరిపోయేంత క్రేజ్ ను అందుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ సౌత్ లో మెల్లగా నెంబర్ వన్ పొజిషన్ కు వెలుతోంది.

మహేష్ బాబు సర్కారు వారి పాట అలాగే తమిళ్ లో రజినీకాంత్ తో అన్నత్తే అనే సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలు చాలు అమ్మడి రేంజ్ పెరగడానికి. ఇక బాలీవుడ్ లో గతంలో మైదాన్ అనే సినిమా చేయడానికి కీర్తి సురేష్ మొదట గ్రీమ్ సిగ్నల్ ఇచ్చింది. అజయ్ దేవ్ గన్ హీరోగా నటిస్తున్న ఆ సినిమా ఫూట్ బాల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఏమైందో ఏమో గాని కీర్తి ఆ సినిమా షూటింగ్ మొదలవుతున్న సమయంలో సడన్ గా తప్పుకుంది.

ఇక చాలా రోజుల తరువాత ఒక బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్ నుంచి ఆఫర్ రాగా అమ్మడు కథల చర్చల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఆ సినిమా చేయాలని ఉందట కానీ ఇంకా ఫైనల్ కాల్ ఇవ్వలేదని తెలుస్తోంది. మరి ఆ సినిమా ఎప్పుడు ఎలా మొదలవుతుందో చూడాలి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus