‘మహానటి’ చిత్రంతో 10 సినిమాలు చేసి హిట్లు అందుకున్నా సాధ్యం కాని స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది కీర్తి సురేష్. అలనాటి గొప్ప నటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఏదో నటించాను అని కాకుండా… ఆ పాత్రలో జీవించింది ఈ బ్యూటీ. ఇదిలా ఉండగా 2016 లో ‘నేను శైలజ’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత ‘నేను లోకల్’ చిత్రంతో మరో సూపర్ హిట్ అందుకుంది.
ఇక వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో నటించి ప్లాప్ అందుకున్నా.. అతి తక్కువ టైంలోనే పవన్ కళ్యాణ్ తో నటించి ఆశ్చర్య పరచడమే కాకుండా.. తెలుగులో అందరి దర్శక నిర్మాతల అటెన్షన్ డ్రా చేసింది. ఈ బ్యూటీ ఇప్పుడు ‘మిస్ ఇండియా’ అనే తెలుగు చిత్రంతో పాటు తమిళంలో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఇప్పడు ఈమె పెళ్లి చేసుకోబోతోంది అనే వార్తలు ఊపందుకున్నాయి.
ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు కొడుకుతో ఈమె వివాహం జరుగబోతుందని టాక్ నడుస్తుంది. మరో విషయం ఏమిటంటే… 2020 పూర్తయ్యేలోపే కీర్తి వివాహం ఉంటుందని తెలుస్తుంది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైములో వివాహం చేసుకోవడం అంటే.. ఆమె కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్టే అని ఆమె అభిమానులు భయపడుతున్నారు. అయితే ఆమె గ్లామర్ పాత్రలు చెయ్యడం లేదు.. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేస్తుంది కాబట్టి ఎటువంటి కంగారు పడనవసరం లేదు అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
Most Recommended Video
ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్