గ్లామర్ డోస్ పెంచనున్న కీర్తి…ఆ సినిమా కోసమేనా?

‘నేను శైలజ’ వంటి సూపర్ హిట్ చిత్రంతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన కీర్తి సురేష్ ఆ తరువాత ‘నేను లోకల్’ అనే బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. తమిళంలో అప్పటికే ఈ బ్యూటీ.. ‘రైల్’ ‘రెమో’ వంటి చిత్రాల్లో నటించింది. దాదాపు ఈమె నటించిన అన్ని సినిమాలు హిట్లు అయ్యాయి కాబట్టి.. ఆ తరువాత పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఆ చిత్రంతో కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనుకుంటే అలా జరగలేదు.

ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయితే అదే ఏడాది వచ్చిన ‘మహానటి’ చిత్రం మాత్రం కీర్తి సురేష్ ను స్టార్ హీరోయిన్ ను చేసింది. ప్రస్తుతం రజినీ కాంత్, మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ల సినిమాల్లో నటించబోతుంది కీర్తి సురేష్. ఇదిలా ఉండగా.. కెరీర్ ప్రారంభం నుండీ కీర్తి గ్లామర్ షో చేసింది లేదు. అలాంటి సినిమాల్లో కూడా కీర్తి సురేష్ నటించలేదు. కథా ప్రాధాన్యత ఉండే సినిమాల్లోనే నటిస్తూవచ్చింది. మొదట్లో కాస్త బొద్దుగా కనిపించినా … ఇప్పుడు సన్నబడిన సంగతి తెలిసిందే.

అయితే కీర్తి త్వరలోనే బికినీ లో దర్శనమివ్వనుందట.వివరాల్లోకి వెళితే.. కీర్తి సురేష్ నటించిన ‘మిస్ ఇండియా’ చిత్రం త్వరలో ఓటిటి లో విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో ఓ సీన్ లో ఈమె బికినీ లో కనిపించబోతుందని సమాచారం. ఈమె నటించిన ‘పెంగ్విన్’ చిత్రం కూడా ఓటిటి లో విడుదలైన సంగతి తెలిసిందే.

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus