బరువు పెరగకపోయినా సావిత్రిలా కనిపిస్తాను : కీర్తి సురేష్
- July 1, 2017 / 12:27 PM ISTByFilmy Focus
నేను శైలజ, నేను లోకల్ చిత్రాలతో కీర్తి సురేష్ విజయాలతో పాటు మంచి అవకాశాలను పట్టేసింది. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు, సావిత్రి బయోపిక్ మహానటి లోను లీడ్ రోల్ అందిపుచ్చుకుంది. పవన్ సరసన స్లిమ్ గా కనిపించాల్సి ఉండగా, మహానటిలో బొద్దుగా ఉండాలి. దీంతో సావిత్రిలా కనిపించడానికి కీర్తి సురేష్ బరువు పెరిగిందని మీడియాలో హడావుడి మొదలయింది. ఈ వార్తలు తన కెరీర్ కి ఆటంకంగా మారుతాయని గ్రహించిన కీర్తి స్పందించింది. బరువు పెరిగిన రూమర్స్ ని ఖండించింది. ‘నేను బరువు పెరుగుతున్నానన్నది అబద్ధం. నిజం చెప్పాలంటే నేను ఈ మధ్య కాలంలో బరువు తగ్గాను.
అయితే ‘మహానటి’ సినిమాలో మాత్రం నేను లావుగానే కనిపిస్తాను. అందుకోసం ప్రోస్థటిక్ మేకప్‌ను ఉపయోగిస్తున్నాం. ఆ మేకప్ సహాయంతో తెరపై నేను సావిత్రిగారిలాగానే కనిపిస్తాన’ని చెప్పింది. ఈ రెండు సినిమాలతో పాటు సూర్య నెక్ట్స్ సినిమా, విక్రమ్ సామి 2, విశాల్ పందెం కోడి 2 సినిమాల్లోనూ కీర్తి సురేష్ నటించనుంది. ఇలా చేతినిండా సినిమాలతో దూసుకుపోతోంది. ఇవన్నీ హిట్ అయితే దక్షిణాదిలో టాప్ హీరోయిన్స్ జాబితాలో కీర్తి సురేష్ చేరిపోతుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















