ఓటీటీలో కీర్తిసురేష్ మూడో సినిమా రిలీజ్

చాలామందికి కీర్తిసురేష్ తోలి చిత్రం అంటే “నేను శైలజ” అని మాత్రమే తెలుసు. కానీ.. ఆ సినిమా కంటే ముందు ఆమె ఒక సినిమా చేసిందని, ఆ సినిమా విడుదలకు నోచుకోలేక ఇబ్బందులుపడుతోందని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆ సినిమాకి ఇప్పటికే రెండుసార్లు టైటిల్ మార్చారు. సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ కథానాయకుడిగా ఎప్పుడో ఆరేడేళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం ఇంకా కొంచెం షూటింగ్ పెండింగ్ కూడా ఉంది.

ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడం ఎలాగో కష్టం కాబట్టి.. మంచి ఓటీటీ ఆఫర్ రావడంతో విడుదలకు సిద్ధమైపోయారు దర్శకనిర్మాతలు. ఓటీటీ రిలీజ్ ఒకే అవ్వడంతో సినిమాకి మళ్ళీ బజ్ తీసుకురావడం కోసం ముందుగా సినిమాకి ఒక మంచి టైటిల్ సెట్ చేశారు. సీనియర్ నరేష్ ప్రధాన పాత్ర పోషించగా మంచి విజయం సొంతం చేసుకున్న “రెండు జళ్ల సీత” అనే టైటిల్ ను ఈ సినిమాకి ఫిక్స్ చేశారు. కథ-కథనం పరంగానే ఈ టైటిల్ ను ఫిక్స్ చేశామని దర్శకనిర్మాతలు చెబుతున్నప్పటికీ..

సినిమా విడుదలయ్యేవరకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే సీన్ ఏమిటి అనేది అర్ధం చేసుకోవడం కాస్త కష్టమే. ఎందుకంటే టీజర్ కి వచ్చిన నెగిటివ్ ఇంపాక్ట్ అలాంటిది. ఇకపోతే.. ఇప్పటివరకు ఓటీటీలో విడుదలైన కీర్తి సినిమాలేవీ సరిగా ఆడలేదు. “పెంగ్విన్, మిస్ ఇండియా” వంటి సినిమాలు డిజిటల్ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. మరి “రెండు జళ్ల సీత” కూడా ఆ కోవలో నిలుస్తుందో లేదో చూడాలి.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus