ఆగ‌స్ట్ 15న రానున్న కీర్తి సురేష్ ‘గుడ్‌ల‌క్ స‌ఖి’ టీజ‌ర్‌!

కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘గుడ్‌ల‌క్ స‌ఖి’. ఎక్కువ‌గా మ‌హిళ‌లే ప‌నిచేస్తున్న ఈ చిత్రానికి శ్రావ్య వ‌ర్మ స‌హ నిర్మాత‌. న‌గేష్ కుకునూర్ డైరెక్ట‌ర్ చేస్తోన్న ఈ సినిమా ఏక కాలంలో తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో నిర్మాణ‌మ‌వుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్పిస్తున్న ఈ మూవీని వ‌ర్త్ ఎ షాట్ మోష‌న్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సుధీర్‌చంద్ర పాదిరి నిర్మిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న ఉద‌యం 10 గంట‌ల‌కు ‘గుడ్‌ల‌క్ స‌ఖి’ టీజ‌ర్‌ను రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంత యువ‌తిగా క‌నిపిస్తున్నారు.

స్పోర్ట్స్ రామ్ కామ్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ షూట‌ర్‌గా న‌టిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్రసాద్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, చిరంత‌న్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఒక చిన్న షూటింగ్ షెడ్యూల్ మిన‌హా మిగ‌తా ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ముగింపు ద‌శ‌లో ఉన్నాయి.

Most Recommended Video

గుంజన్‌ సక్సెనా: ది కార్గిల్‌ గర్ల్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రిలీజ్ తర్వాత చాలా లేట్ గా టీవీల్లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్..!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus