బిగ్ బాస్ హౌస్ లో 10వ వారం ఆట ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ ఈసారి వైకుంఠపాళి ఆటని హౌస్ మేట్స్ కి ఇచ్చాడు. పాము, నిచ్చెన ఆటని పెట్టాడు. ఇందులో భాగంగా రెండు టీమ్స్ గా విడిపోయారు ఇంటి సభ్యులు. సమయానుసారం వచ్చిన మట్టిని తీసుకుని సగం మంది సభ్యులు నిచ్చెనలు చేయాలి. సగం మంది సభ్యులు పాములు చేయాలి. ఇక్కడే స్నేక్ గ్రూప్ లో వాసంతీ, ఆదిరెడ్డి, ఫైమా , రోహిత్, శ్రీహాన్, కీర్తి ఉన్నారు.
ల్యాడర్ గ్రూప్ లో రేవంత్ , రాజ్, ఇనయ, మెరీనా , ఆదిత్య , శ్రీసత్య ఉన్నారు. ఇనయ ఇంకా ఫైమా ఇద్దరూ టీమ్ లీడర్స్ ఇంకా సంచాలక్ గా వ్యవహరిస్తారు. ఇక టాస్క్ స్టార్ట్ అవ్వగానే మట్టిని తీస్కునేందుకు హౌస్ మేట్స్ పోటీ పడ్డారు. ఇక్కడే రేవంత్ పెద్ద మట్టి ముద్దని తీస్కుని పరిగెత్తాడు. హౌస్ మేట్స్ అందరూ మట్టికోసం పోటీ పడ్డారు. ఇక సమయానుసారం వచ్చిన పాము బుస తర్వాత ఛాలెంజ్ లో ఒకరి నిచ్చెనని ఇంకోకరు తగ్గించాల్సి ఉంటుంది. ఇక్కడే కీర్తి ఇంకా రాజ్ ఇద్దరూ పోటీ పడ్డారు.
కిందపడి మరీ కొట్టుకునేంత పనేచేశారు. రాజ్ కీర్తి తర్వాత వాసంతీ ఇంకా శ్రీసత్య ఇద్దరూ కిందపడి మరీ కొట్టుకున్నారు. శ్రీసత్య అయితే వాసంతీకి ఎక్కడా తన నిచ్చెనని కాపాడుకునే అవకాశం ఇవ్వలేదు. దీంతో పాము, నిచ్చెనల టాస్క్ ఆసక్తికరంగా మారింది. ఈవారం నామినేషన్స్ లో ఫైమా ఇంకా ఇనయల మద్యలో పెద్ద ఫైట్ అయ్యింది. అందుకే, ఇప్పుడు ఇద్దరూ కూడా టీమ్ లీడర్స్ అయ్యారు. దీంతో వీరిద్దరికీ టాస్క్ లో గట్టిగా పడిందని, ఇద్దరికీ మాటల యుద్ధం అయ్యిందని టాక్ వినిపిస్తోంది.
అంతేకాదు, ఫైమా వల్ల ఇనయ టాస్క్ నుంచీ అవుట్ అయినట్లుగా సమాచారం. ఇక్కడే ఇనయతో పాటుగా శ్రీసత్య, రోహిత్, వాసంతీ , మెరీనాలు కూడా టాస్క్ నుంచీ అవుట్ అయినట్లుగా తెలుస్తోంది. వైకుంఠపాళీ ఆటలో నిచ్చెనలని కాపాడుకోలేని వాళ్లు పాము కాటుకి బలైపోతారు. ఒకవేళ ఎవరినైనా నిచ్చెనని ఎంచుకుని వాళ్లని తగ్గించగలిగితే ఆటలో ఉంటారు. అయితే, శ్రీసత్య, వాసంతీ, రోహిత్, ఇంకా ఇనయ వీళ్లు ప్రస్తుతం ఈవారం కెప్టెన్సీ టాస్క్ రేస్ నుంచీ అవుట్ అయినట్లుగా సమాచారం. మొత్తానికి అదీ మేటర్.
Most Recommended Video
లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!