శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై శశి కుమార్, భారతి రాజా, మీనాక్షి గోవిందరాజన్, సూరి ప్రధాన పాత్రలో సుశీంద్రన్ దర్శకత్వం లో ప్రముఖ నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి నిర్మిస్తున్న క్రీడా చిత్రం కెన్నడీ క్లబ్. ఈ చిత్రం యొక్కఫస్ట్ లుక్ పోస్టర్ ను పండుగ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలతో విడుదల చేసారు. ఇది పల్లేటూరి నేపధ్యం లో కబడ్డీ క్రీడ సినిమా .
ఈ సందర్భం గా నిర్మాత రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ “సుశీంద్రన్ దర్శకత్వం లో కబడ్డీ క్రీడ నేపథ్యం లో నిర్మించిన చిత్రం కెన్నడీ క్లబ్. ఈ చిత్రం తమిళం లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇది పల్లేటూరి నేపథ్యంలో సాగే కబడ్డీ ఆట. సుశీంద్రన్ గారు అద్భుతంగా తెరకేకించారు. తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది . అందుకే మా అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై తెలుగులో విడుదల చేయటానికి సంకల్పించాం ఫిబ్రవరి లో విడుదల చేయాలనుకుంటున్నాము. సంక్రాతి పండగ సందర్భంగా మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తున్నాము” అని తెలిపారు.
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!