పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తనయుడు ఆకాష్ పూరి (Akash Puri) హీరోగా వచ్చిన ‘రొమాంటిక్’ (Romantic) తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కేతిక శర్మ(Ketika Sharma). ఈ సినిమా ఈమె గ్లామర్ వల్లే హైలెట్ అయ్యింది కానీ సక్సెస్ కాలేదు. తర్వాత నాగ శౌర్యకి (Naga Shaurya) జోడీగా ‘లక్ష్య’ (Lakshya) చేసింది. అది పెద్ద బ్యానర్లో రూపొందిన సినిమానే. తర్వాత వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) సరసన ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga) చేసింది. ఆ వెంటనే సాయి ధరమ్ తేజ్ కు (Sai Dharam Tej) జోడీగా ‘బ్రో’ (BRO) లో నటించింది. ఇవన్నీ ఫ్లాప్ అయ్యాయి.
తర్వాత ఈమెకు సహజంగానే అవకాశాలు తగ్గాయి. ఈ క్రమంలో ‘రాబిన్ హుడ్’ (Robinhood) వంటి సినిమాల్లో ఐటెం సాంగ్ చేయడానికి కూడా రెడీ అయిపోయింది. అలా కూడా ఈమెకు సక్సెస్ లభించలేదు. దీంతో కేతిక శర్మ పని అయిపోయింది అని అంతా ఫిక్స్ అయ్యారు. ఇలాంటి టైంలో ‘సింగిల్’ (#Single) వచ్చింది. శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా రూపొందిన ఈ సినిమాలో పూర్వ అనే పాత్రలో నటించింది కేతిక. కేవలం పేరుకు హీరోయిన్ అని కాకుండా.. కథలో ఈమె పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది.
అది కేతికకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక మే 9న రిలీజ్ అయిన ‘సింగిల్’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించింది. మొదట్లో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా.. కామెడీ వర్కౌట్ అవ్వడం వల్ల బాక్సాఫీస్ వద్ద గట్టెక్కేసింది ఈ సినిమా. కేతిక పాత్రకి కూడా మంచి మార్కులు పడ్డాయి. మొదటి నుండి ఈ సినిమాని ఆమె చాలా శ్రద్ధతో ప్రమోట్ చేస్తూ వచ్చింది. ఇప్పటికీ బాగా ప్రమోట్ చేస్తుంది. ఇక నుండి అయినా ఆమె దశ తిరుగుతుందేమో చూడాలి.