ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్లను, వైరల్ టాపిక్‌లను పట్టుకుని సినిమాలు చేయడంలో మాస్ యహారాజ రవితేజ (Ravi Teja) దిట్ట అని చెప్పొచ్చు. ఆయన సినిమాల్లో కథానాయికల ఎంపికను పరిశీలిస్తే ఈ విషయం క్లారిటీగా తెలిసిపోతుంది. ఇప్పుడు అదే లాజిక్‌తో రవితేజ సినిమాకు ఓ హిట్ హీరోయిన్‌ను ఎంపిక చేశారు అని తెలుస్తోంది. ఆమెనే ‘సింగిల్’ (#Single) సినిమాతో మంచి విజయం అందుకున్న కేతిక శర్మ(Ketika Sharma). ‘రొమాంటిక్’ (Romantic) సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చినా.. సరైన విజయం అందుకున్నది మాత్రం ‘సింగిల్’ చిత్రంతోనే.
ఇటీవల ‘మాస్ జాతర’ (Mass Jathara) సినిమాను ముగించిన రవితేజ.. కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతున్నాడు. కిశోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి కాస్టింగ్ పనులను వేగవంతం చేసింది సినిమా నిర్మాణ సంస్థ ఎస్.ఎల్.వి సినిమాస్. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు అవకాశముందని సమాచారం. తొలుత ఈ పాత్రల కోసం మమితా బైజు (Mamitha Baiju), కయాడు లోహర్ (Kayadu Lohar) పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ఇద్దరూ దాదాపు ఖరారు అనుకుంటుండగా కేతిక శర్మ పేరు బయటకు వచ్చింది.
సినిమా విషయంలో కేతికతో టీమ్ ఇప్పటికే సంప్రదించిందని, ఆమె కూడా ఈ సినిమాకు ఓకే చెప్పింది అని అంటున్నారు. రవితేజతో సినిమా అంటే మాస్ అభిమానులకు దగ్గరవ్వొచ్చు కాబట్టి హీరోయిన్లు ఈజీగానే ఒప్పేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కేతిక కూడా ఇదే ఆలోచనతో సినిమా ఓకే చేసింది అని అంటున్నారు. పూర్తి స్థాయి వినోదంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో యాక్షన్ పాళ్లు కూడా ఉంటాయట. జులై నుండి సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది అంటున్నారు.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలా ఈ సినిమాకు ‘అనార్కలి’ అనే పేరు పరిశీలిస్తున్నారట. ఆ అనార్కలి కేతిక శర్మనే అవ్వొచ్చు అని సమాచారం. మరి కిషోర్ తిరుమల ఆలోచనల్లో ఏముందో చూడాలి. లైఫ్‌ను తనదైన కోణంలో విశ్లేషించే కిషోర్ తిరుమలలో ఈసారి ఏం చెప్పబోతున్నారో చూడాలి. ‘చిత్రలహరి’తో (Chitralahari) మంచి విజయం అందుకున్న ఆయన ఆ తర్వాత వరుసగా ‘రెడ్’ (RED), ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ (Aadavallu Meeku Johaarlu) సినిమాలు చేసి ఇబ్బందికర ఫలితాలు అందుకున్నారు.