నితిన్ (Nithiin) కెరీర్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా కొనసాగుతోంది. ఇక ఇప్పుడు ‘ఎల్లమ్మ’ సినిమా ఓ కీలక మలుపు కావొచ్చని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి డైరెక్షన్ చేయబోయే వేణు యల్దండి (Venu Yeldandi) గతంలో ‘బలగం’ (Balagam) సినిమాతో తెలంగాణ మూలాలను తెరపై ఆవిష్కరించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే నమ్మకంతో ‘ఎల్లమ్మ’ కథనాన్ని రూపొందించడంతో ప్రాజెక్ట్‌పై మంచి ఆసక్తి ఏర్పడుతోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, సినిమా షూటింగ్ జూన్ రెండో వారం నుంచి ప్రారంభం కానుంది.
స్క్రిప్ట్ నుంచి లొకేషన్ల ఎంపిక వరకు, వేణు చాలా జాగ్రత్తగా ప్రీ ప్రొడక్షన్‌ను ప్లాన్ చేశారట. ఈసారి కూడా తెలంగాణ విలేజ్ బ్యాక్‌డ్రాప్, భావోద్వేగాలను హైలెట్ చేసి, అందులో ప్రేమ కోణాన్ని కలిపి కొత్తగా చూపించనున్నారని చెబుతున్నారు. ఇక హీరోయిన్ ఎంపిక విషయమై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సాయి పల్లవి (Sai Pallavi) , కీర్తి సురేష్(Keerthy Suresh) పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
అయితే, అజయ్–అతుల్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాయడం మరో ప్రత్యేక ఆకర్షణ కానుంది. కథలో ఆధ్యాత్మికత, గ్రామీణ మూలాలు ప్రధానంగా ఉంటాయని అంటున్నారు. ‘రాబిన్‌హుడ్’ (Robinhood) సినిమాతో నిరాశ చెందిన నితిన్ ఇప్పుడు ఫ్యామిలీ, కంటెంట్ బేస్డ్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. ‘తమ్ముడు’తో (Thammudu) మార్కెట్ స్థిరపరిచి, ‘ఎల్లమ్మ’తో మళ్లీ మాస్‌కు దగ్గరవ్వాలన్నది ఆయన తాజా వ్యూహంగా చెబుతున్నారు.
ఈ ప్రాజెక్ట్ కోసం నితిన్ సరికొత్త లుక్‌ను కూడా ట్రై చేయనున్నారట. ఇక సినిమాను వచ్చే ఏడాది దసరా సందర్భంగా విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు (Dil Raju) లక్ష్యంగా పెట్టుకున్నారని సమాచారం. మొత్తానికి ‘ఎల్లమ్మ’ కథ ద్వారా బలగం తరహా విజయం సాధిస్తాననే నమ్మకంతో వేణు, నితిన్ కలిసి మరో బ్లాక్‌బస్టర్ ఫార్ములా సిద్ధం చేస్తున్నారని ఫిలింనగర్‌లో టాక్.