Ketika, Pawan: తమ్ముడితో అవ్వగానే అన్నతో నటించబోతున్న కేతిక..!

పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రొమాంటిక్’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది కేతికశర్మ. ఆ సినిమా అంతంత మాత్రం ఆడినా ఈమె గ్లామర్ కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఈమె నాగ శౌర్య తో చేసిన ‘లక్ష్య’ రాంగ్ టైం లో రిలీజ్ అవ్వడం వల్ల అది కూడా నిలబడలేకపోయింది. ప్రస్తుతం ఈమె మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగ రంగ వైభవంగా’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా హిట్ అయ్యి ఆమెకి యూత్ లో ఉన్న క్రేజ్ ను పెంచుతుందా లేదా అన్నది చూడాలి..! అయితే ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది అనేది తాజా సమాచారం. అయితే పవన్ కు ఈమె జోడీగా నటించడం లేదు.అతని మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు జోడీగా నటించబోతుంది. అంటే తమ్ముడి సినిమా అయిపోయాక అన్నయ్యతో నటించబోతుంది అన్న మాట.

సముద్రఖని డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్..సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ‘వినోదయ సీతమ్’ రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ మూవీలో పవన్ సరసన హీరోయిన్ ఉండదు.ఆయనది దేవుడి టైపు పాత్ర అని తెలుస్తుంది. జూలై నుండీ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. 4 నెలల్లోనే ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అంతా అనుకున్నట్టు జరిగితే 2023 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus