KGF Chapter 2 Collections: తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ గా నిలిచిన ‘కె.జి.ఎఫ్ 2’

2018లో వచ్చిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ పై కూడా మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు గానే దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కె.జి.ఎఫ్ 2’ ని తీర్చిదిద్దిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 14న భారీ రేంజ్లో విడుదలైన ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా 4 వారాలు పూర్తి చేసుకుంది. అయితే నిన్న ‘సర్కారు వారి పాట’ ఎంట్రీతో కాస్త డౌన్ అయ్యింది.

అయినప్పటికీ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2′ కి ఇంకో వీకెండ్ మిగిలుంది.’సర్కారు వారి పాట’ కి మిక్స్డ్ టాక్ రావడంతో ఈ వీకెండ్ కు కూడా ‘కె.జి.ఎఫ్ 2’ కి 180 థియేటర్లు దొరికాయి.ఇది పక్కన పెట్టి ఒకసారి ‘కె.జి.ఎఫ్ 2’ 29 రోజుల కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 43.43 cr
సీడెడ్ 11.93 cr
ఉత్తరాంధ్ర  7.96 cr
ఈస్ట్  5.59 cr
వెస్ట్  3.60 cr
గుంటూరు  4.86 cr
కృష్ణా  4.36 cr
నెల్లూరు  2.77 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 84.50 cr

‘కె.జి.ఎఫ్2’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 12 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి రూ.84.5 కోట్లు షేర్ ను రాబట్టింది. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఈ రికార్డ్ ‘2.o’ పేరుతో ఉండేది.కానీ ఆ మూవీ బ్రేక్ ఈవెన్ కాలేదు.

కానీ ‘కె.జి.ఎఫ్ 2’ తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేయడమే కాకుండా రూ.9.5 కోట్ల లాభాలను అందించింది. కాకపోతే ఆంధ్రాలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కాలేదు. అక్కడ ఈ చిత్రానికి రూ.49 కోట్ల బిజినెస్ జరిగితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ. 41.07 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దీంతో అక్కడ రూ.7.93 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. అయితే ఓవర్ ఆల్ గా అయితే ఈ మూవీ సూపర్ హిట్ అనే చెప్పాలి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus