KGF2, RRR: ఆర్ఆర్ఆర్ ను ఫాలో కాబోతున్న కె.జి.ఎఫ్2!

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అత్యధిక భారీ స్థాయిలో విడుదల కాబోతున్న సినిమాలలో కేజిఎఫ్ చాప్టర్ 2 ఒకటి. తప్పకుండా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ తో ఈ సినిమా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కన్నడ స్టార్ హీరో యష్ ఆ సినిమాతో మరో లెవల్ కి వెళ్తాడు అని కూడా అనిపిస్తోంది.

Click Here To Watch NOW

ఇప్పటికే విడుదలైన టీజర్ ఫస్ట్ సాంగ్ కూడా సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇక అందరి ఫోకస్ ప్రస్తుతం ట్రైలర్ పైనే ఉంది. అయితే ఒక విషయంలో కేజిఎఫ్ చిత్ర యూనిట్ సభ్యులు ఆర్ఆర్ఆర్ ఫార్ములాలను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమాకు మిగతా భాషల్లో కంటే కూడా తెలుగు భాష లోనే భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఒక విధంగా దాదాపు ఈ సినిమాను కన్నడ ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో తెలుగు ప్రేక్షకులు కూడా అదే రేంజ్ లో ఆదరిస్తారు అని అర్థమవుతుంది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవల ఆర్ఆర్ఆర్ తరహాలోనే నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డర్ చిక్ బల్లపూర్ లోనే నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. దర్శకుడు ప్రశాంత్ నీల్ త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ లో డోస్ పెంచాలని చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ఆల్ చిత్ర యూనిట్ సభ్యులు ఎలాగైతే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా ప్రమోషన్స్ ఎలాగైతే చేస్తున్నారో

అదే తరహాలో కేజిఎఫ్ 2 చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్రమోషన్స్ చేయాలని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శకుడు రాజమౌళి కూడా ప్రత్యేక అతిథిగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేజిఎఫ్ చాప్టర్ 1 ఈవెంట్ కు కూడా రాజమౌళి వచ్చి సినిమాను ప్రమోట్ చేసి సపోర్ట్ చేశారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus