హాట్ టాపిక్ గా ఎన్టీఆర్ డైరెక్టర్ రెమ్యూనరేషన్?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ బర్త్ డే ని భారీ ఎత్తున్న సెలెబ్రేట్ చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా సామూహిక వేడుకలలో పాల్గొనకూడదు అని ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. దీనితో వారు సోషల్ మీడియాలో రభస చేస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే మిలియన్స్ లో ఎన్టీఆర్ బర్త్ డే విషెష్ ట్వీట్స్ మరియు పోస్ట్స్ వేయడం జరిగింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీలో కొమరం భీమ్ గా నటిస్తుండగా, త్రివిక్రమ్ మూవీ షూట్ లో త్వరలో జాయిన్ కావాల్సివుంది.

లాక్ డౌన్ అనంతరం ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఎన్టీఆర్ 30వ చిత్రంగా వస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ తన మార్కు యాక్షన్ మరియు హ్యూమర్ జోడించి తెరకెక్కిస్తారని సమాచారం. కాగా త్రివిక్రమ్ తరువాత ఎన్టీఆర్, క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపైన ఎటువంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ పై దర్శక నిర్మాతల మధ్య ఒప్పందాలు జరిగిపోయాయని తెలుస్తుంది.

అలాగే ఈ మూవీ కోసం ప్రశాంత్ నీల్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా ఓ స్టార్ హీరోకి ఇచ్చే రెమ్యూనరేషన్ ప్రశాంత్ నీల్ తీసుకుంటున్నారట. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా 17కోట్ల రూపాయలు ఆఫర్ చేశారట. ఇప్పటికే దీనికి సంబంధించి 2 కోట్లు అడ్వాన్స్ గా కూడా ఇచ్చారని వినికిడి. మరి డైరెక్టర్ కే అంత ఆఫర్ చేసిన నిర్మాతలు ఎన్టీఆర్ కి ఎంత ఇవ్వనున్నారో.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus