Archana Jois: కేజిఎఫ్ సినిమా కథనే నచ్చలేదు: కేజిఎఫ్ నటి

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కే జి ఎఫ్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా ద్వారా ప్రశాంత్ నీల్ కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమాలో హీరోకి తల్లి పాత్రలో నటించిన నటి అర్చన జోయిస్ నటన కూడా ఎంతో అద్భుతం అని చెప్పాలి. ఈమె సినిమాలో చెప్పే డైలాగ్స్ కూడా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె కే జి ఎఫ్ సినిమా గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు నటించడానికి ఏమాత్రం ఆసక్తి లేదని, నాతో ఈ సినిమాలో నటింప చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా హీరోకి తల్లి పాత్రలో నటించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదని తెలియజేశారు. నేను నటించనని చెప్పినప్పటికీ బలవంతంగా నా చేత ఈ సినిమాలో నటించడానికి నా స్నేహితుల ద్వారా నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారని తెలిపారు.

చిత్ర బృందం నన్ను కలిసినప్పుడు మీరు ఈ సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించాలని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతూ అసలు నా వయసు ఎంతో తెలుసా అని వారిని అడిగాను అప్పుడు నాకు ఇంకా 22 సంవత్సరాలు కావడంతో నేను షాక్ అయ్యానని ఈమె తెలిపారు. నేను నో చెబుతున్నా వాళ్ళు వదిలిపెట్టలేదు. నన్ను అడుగుతూనే ఉన్నారు. ఇంతలా అడుగుతున్నారు కదా ఒకసారి కథ విందామని కూర్చుంటే వారు చెప్పే కథ నాకు అసలు ఏ మాత్రం నచ్చలేదని ఈమె తెలిపారు.

అందరి బలవంతం చేత నేను (Archana Jois) ఈ సినిమాకు ఒప్పుకున్నప్పటికీ మనస్పూర్తిగా ఈ సినిమా చేయాలనే ఇష్టం నాకైతే ఏమాత్రం లేదని కానీ సినిమా విడుదలైన తర్వాత ఊహించిన విధంగా నా పాత్రకు మంచి పాపులారిటీ వచ్చింది అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె తాజా సినిమాల విషయానికి వస్తే మాన్షన్ 24 అనే సినిమాలో నటించారు. ఈ సినిమా అక్టోబర్ 17న డైరెక్ట్ గా ఓటిటి హాట్ స్టార్ లో రిలీజై ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus