700 మంది అభిమానులతో సెల్ఫీ దిగిన హీరో….యశ్ ఓపికకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు బయటకు వస్తే పెద్ద ఎత్తున అభిమానులు వారితో కలిసి సెల్ఫీలు దిగడానికి ఏగపడతారు. అయితే కొన్నిసార్లు కొందరు సెలబ్రిటీల సహనంతో అభిమానులకు సెల్ఫీ ఇవ్వగా మరికొందరు మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు.అయితే కన్నడ చిత్ర పరిశ్రమలో కే జి ఎఫ్ సినిమా ద్వారా ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు యశ్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా కే జి ఎఫ్ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న

ఈయన తాజాగా బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం అనంతరం అభిమానులు అతనితో కలిసి సెల్ఫీ దిగడానికి ఆసక్తి చూపించారు.అయితే ఈ కార్యక్రమ నిర్వాహకులు అభిమానులు అందరితో కలిసి ఒక ఫోటో దిగడానికి అనుమతి తెలపగా అభిమానులు మాత్రం హీరో యశ్ తో విడివిడిగా సెల్ఫీలు దిగడానికి ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే యశ్ గంటల తరబడి ఎంతో ఓపికగా అక్కడ ఉన్నటువంటి 700 మంది అభిమానులకు విడివిడిగా సెల్ఫీలకు ఫోజులిచ్చారు.

ఇలా 700 మంది అభిమానులతో ఈయన సెల్ఫీలు దిగడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇలా యశ్ అభిమానులను గౌరవించి ఎంతో ఓపికగా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసినటువంటి ఎంతోమంది అభిమానులు నేటిజన్స్ ఈయన ఓపికకు ఫిదా అవుతూ యశ్ రియల్లీ గ్రేట్..

నిజమైన హీరో అంటే మీరే అంటూ పెద్ద ఎత్తున ఇతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కేజీఎఫ్ తర్వాత యశ్ ఎలాంటి కొత్త ప్రాజెక్టులను ప్రకటించలేదు దీంతో తన తదుపరి సినిమాపై అభిమానులు ఎంతో ఆతృత కనపరుస్తున్నారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus