విషయం వీక్‌గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్‌లో ఉంటుంది.. మహేష్ బాబు ‘ఆగడు’ సినిమాలోని ఈ డైలాగ్ బాగా పాపులర్ అయింది.. అసలే అధికారం, పదవి లేక తిరిగి ఫామ్‌లోకి రావడానికి నానా పాట్లు పడుతున్న అగ్రనేత రాహుల్ గాంధీ తన పబ్లిసిటీ వల్ల ఇరకాటంలో పడ్డారు.. తమ సినిమాలోని కంటెంట్‌ని రాహుల్ తన పార్టీ ప్రమోషన్స్, ఎలక్షన్ క్యాంపెయిన్‌తో పాటు వ్యక్తిగత ఎలివేషన్లకు వాడుకుంటున్నారని.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మీద ఎమ్ఆర్‌టీ మ్యూజిక్ సంస్థ కాపీ రైట్ కేసు వేసింది..
రాహుల్ గాంధీ కేంద్రంలో మళ్లీ తమ పార్టీ జెండా ఎగరెయ్యాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.. భారత్ జోడో యాత్ర పేరుతో పార్టీని బలోపేతం చేయడానికి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ.. నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతున్నారు. ఇటీవల తెలంగాణలోనూ పర్యటించారు. జగ్గా రెడ్డి, రేవంత్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నేతలతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటించారు.. అయితే రాహుల్ ప్రచారాల్లో భాగంగా.. పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని వీడియోల్లో ‘కె.జి.యఫ్ 2’ మూవీలోని బ్యాగ్రౌండ్ స్కోర్‌ని బీభత్సంగా వాడేశారు..
వీలు కుదిరినప్పుడల్లా నేపథ్య సంగీతాన్ని వాడడం మొదలెట్టారు.. పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఈ వీడియోలను షేర్ చేస్తున్నారు. యష్ స్క్రీన్ మీద స్లో మోషన్‌లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు బీజీఎమ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.. అదే ఇప్పుడు రాహుల్ కొంపముంచింది.. తమ వద్ద నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా.. ‘కె.జి.యఫ్ 2’ సినిమాలోని బ్యాగ్రౌండ్ స్కోర్ వాడారంటూ ఫిర్యాదు చేసింది ఎమ్ఆర్‌టీ సంస్థ..
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసిన పలు రాహుల్ గాంధీ వీడియోల్లో తాము హక్కులు కొనుకున్న ‘కె.జి.యఫ్ 2’ లోని కంటెంట్‌ని ఫ్రీ కంటెంట్ టైపులో వాడారని.. మార్కెటింగ్, పబ్లిసిటీ కోసం పర్మిషన్, లైసెన్స్ లాంటివి లేకుండా అలా ఎలా వాడతారంటూ కాపీ రైట్ కేస్ వేసింది.. దీని గురించి పార్టీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.. వీళ్లు పార్టీ ప్రమోషన్స్ కోసం బీజీఎమ్ వాడితే.. రాహుల్ గాంధీ మీద ఫన్నీ మీమ్స్ చెయ్యడానికి కూడా రాకీ భాయ్ మ్యూజిక్‌నే వాడడం విశేషం..
MRT Music ( #KGF2) files Copy Right Case against videos posted by the Indian National Congress featuring Mr. Rahul Gandhi, for using content without seeking permission/license for marketing and publicity. #MRTMusic #CopyRights pic.twitter.com/YlgFlPf8db
— (@UrsVamsiShekar) November 4, 2022
Most Recommended Video
‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!