KGF2 OTT: ‘కేజీఎఫ్2’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?

రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కేజీఎఫ్’. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అవ్వడంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను మించేలా సినిమాను రూపొందించారు దర్శకనిర్మాతలు. సినిమా కూడా మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తొలిరోజునే రూ.150 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా లాంగ్ రన్ లో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

యష్ యాక్టింగ్, ప్రశాంత్ నీల్ టేకింగ్ సినిమాను మరో లెవెల్లో నిలబెట్టాయి. సౌత్ నుంచి వచ్చిన ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ఓటీటీ ప్రియులు ఈ సినిమా ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతుందా..? అని ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది. జూన్ 3 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కొన్నిరోజుల క్రితమే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది కానీ రెంట్ తీసుకొని సినిమాను చూడాలి.

కానీ జూన్ 3 నుంచి డబ్బులు చెల్లించకుండా.. సబ్స్క్రిప్షన్ ఉంటే సినిమా చూసుకోవచ్చు. ఇది ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ కీలకపాత్రల్లో నటించారు.హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సౌత్ సినిమా అయినప్పటికీ బాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఆడింది ‘కేజీఎఫ్2’. ఒక్క నార్త్ నుంచే దాదాపు 400 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది ఈ సినిమా.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus