‘జల్లెడ పడితే ఒక్కడు కూడా నిలబడడు. ఇలాంటి ధైర్యం లేని జనాలను పెట్టుకుని వీడేం చేస్తాడు, అవును సార్ మీరన్నట్టే మాకు ధైర్యం ఉండేది కాదు, శక్తి ఉండేది కాదు, నమ్మకము ఉండేది కాదు, చావు మా మీద గంతులేసేది,కానీ ఒకడు అడ్డు నిలబడ్డాడు అని కాళీ ముందు తలనరికాడు కదా, ఆ రోజు చాలా సంవత్సరాల తర్వాత చావు మీద మేము గంతులేసాం, వాడు కత్తి విసిరిన వేగానికి ఒక గాలి పుట్టింది సర్,
ఆ గాలి ఇక్కడ అందరికీ ఊపిరి ఇచ్చింది, మీకు ఓ సలహా ఇస్తాను సర్ అతనికి మాత్రం మీరు అడ్డు నిలబడకండి సార్…’ అనే డైలాగులతో కె. జి.ఎఫ్ ఫస్ట్ సింగిల్ అయిన తుఫాన్ స్టార్ట్ అయ్యింది. ‘ తుఫాన్ తుఫాన్ ఎలుగెత్తి ఎగసిపడి తొడగొట్టినదే’ అంటూ ఒక్కసారిగా హై ఇచ్చింది. చాలా అగ్రెసివ్ గా ఈ పాట సాగింది. గూజ్ బంప్స్ తెప్పించే విధంగా కూడా ఈ పాట ఉందని చెప్పొచ్చు.
రవి బస్రుర్ సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ సూపర్ గా సెట్ అయ్యాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం పాన్ ఇండియా స్థాయిలో ఎంత సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవరంలేదు. ఇప్పుడు ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 14 న ఈ చిత్రం విడుదల కాబోతుంది.