‘ఖడ్గం’ హీరోయిన్ మళ్ళీ బిజీగా మారుతుందే..!

‘ఖడ్గం’ సినిమాలో ‘ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్’ అంటూ అమాయకంగా అడిగే హీరోయిన్… సంగీత అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ అమ్మడు తెలుగులో ‘నవ్వుతూ బతకలిరా’ ‘పెళ్ళాం ఊరెళితే’ ‘సంక్రాంతి’ ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’ వంటి చిత్రాలలో నటించిన బ్యూటీ పెద్దగా సక్సెస్ కాలేకపోయినా అడపాదడపా సినిమాలు చేస్తూ కాలం గడిపింది. ఒక్క తెలుగులోనే కాదు.. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా పెద్దగా ఫలితం దక్కలేదు. ఇక క్రిష్ అనే సింగర్ ని పెళ్ళి చేసుకుని సినిమాలని తగ్గించేసింది.

అయితే ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం. ‘తఅనే తమిళ చిత్రంలో సంగీత నటిస్తుందట. విజయ్ ఆంటోని .. రమ్య నంబిసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సంగీత ఓ కీలకమైన పాత్ర పోషిస్తుందట.దీనితో పాటూ శ్రీకాంత్ నటిస్తున్నతెలంగాణ దేవుడు చిత్రంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక ‘తమిళ రసన్’ గురించి సంగీత మాట్లాడుతూ .. ” పెళ్ళి తరువాత కూడా నాకు చాలా అవకాశాలు వచ్చాయి. అయితే అవి అంతగా నచ్చకపోవడం వల్ల చేయలేదు. ఈ చిత్రంలో నాకు నచ్చిన పాత్ర కావడంతో వెంటనే ఓకే చెప్పేసాను .. అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus