ఆస‌క్తిని పెంచుతున్న…`ఖాకి` బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌!

స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ ఒక ఎత్తు. వాటికి స‌రైన నేప‌థ్య సంగీతం కుద‌ర‌డం ఒక ఎత్తు. స‌న్నివేశంలోని బ‌లాన్ని చెప్పాల‌నుకున్న ప్ర‌తిసారీ నేప‌థ్య సంగీతం దానికి ప్రాణం పోస్తుంది. ఏ సినిమా స‌క్సెస్‌కైనా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీ రోల్ పోషిస్తుంది. తాజాగా `ఖాకి` ట్రైల‌ర్ చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ ఆ విష‌యం మ‌రోసారి అర్థ‌మ‌వుతుంది.

 ఇంటెన్స్ ఉన్న డైలాగులు, ఆలోచింప‌జేసే దృశ్యాలు, ఛేజింగ్ లు, పౌరుషం, ప్రేమ‌, అటాక్‌లు.. ఒక‌టేంటి?  షాట్ ఏదైనా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆయా షాట్‌ల‌ను ట్రైల‌ర్‌లో ట్రెమండ‌స్‌గా ఎలివేట్ చేసింది. త‌న‌దైన మార్క్ పాట‌ల‌తో ఇప్ప‌టికే `ఖాకి` ఆడియో ట్రెండ్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. దానికి తోడు జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మ‌రింత గొప్ప‌గా కుదిరింద‌నే విష‌యం ట్రైల‌ర్ ని బ‌ట్టి ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. కార్తి, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట తెర‌మీద చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది. హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ ప‌తాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా తెలుగులో అందిస్తున్నారు. ఈ నెల 17న గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus