మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఖిలాడి’. ఫిబ్రవరి 11న విడుదలై ఈ చిత్రం ఫ్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని.. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ ‘పెన్ స్టూడియోస్’, ‘ఏ స్టూడియోస్’ బ్యానర్ల పై కోనేరు సత్య నారాయణ నిర్మించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ మొదటి వారం పర్వాలేదు అనిపించినప్పటికీ రెండో వారం చేతులెత్తేసింది.
నిజానికి రిలీజ్ రోజున టాక్ ను బట్టి అయితే ఈ మూవీ వీకెండ్ తర్వాత దుకాణం సర్దేస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ సినిమాలు ఏమీ లేకపోవడం వల్ల 2 వారాల వరకు థియేటర్లలో నిలబడింది.
ఈ చిత్రం 2 వారాల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 4.00 cr |
సీడెడ్ | 1.88 cr |
ఉత్తరాంధ్ర | 1.61 cr |
ఈస్ట్ | 0.84 cr |
వెస్ట్ | 0.67 cr |
గుంటూరు | 1.11 cr |
కృష్ణా | 0.66 cr |
నెల్లూరు | 0.56 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 11.33 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 2.09 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 13.42 cr |
‘ఖిలాడి’ చిత్రానికి రూ.22.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.23 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 2 వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.13.46 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.9.54 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం ఓకె అనిపించిన ఈ చిత్రం రెండో వారం మాత్రం ఆ జోరు చూపించలేకపోయింది. 3 వ వీకెండ్ కు 46 థియేటర్లు మాత్రమే మిగిలాయి. వాటితో ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఈ వీకెండ్ తో ‘ఖిలాడి’ ఫుల్ రన్ ముగిసే అవకాశం ఉంది. మొత్తంగా బయ్యర్లకి భారీ నష్టాలు అయితే తప్పేలా లేవు.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!