Khiladi OTT: ఖిలాడీ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. కానీ?

రవితేజ హీరోగా డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా తెరకెక్కిన ఖిలాడీ సినిమా గత నెల 11వ తేదీన థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. రిలీజైన రోజే ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఫుల్ రన్ లో కేవలం 15 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. అయితే ఈ నెల 11వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఖిలాడీ మూవీ అందుబాటులోకి రానుందని సమాచారం అందుతోంది.

థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో అయినా హిట్ అనిపించుకుంటుందేమో చూడాల్సి ఉంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వరుసగా పెద్ద సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ సబ్ స్క్రైబర్లను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. క్రాక్ సినిమాతో సక్సెస్ సాధించిన రవితేజ ఖిలాడీ సినిమాతో ఫ్లాప్ ను ఖాతాలో వేసుకున్నారు. అనసూయ, అర్జున్ ఖిలాడీ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా కోసం రవితేజ 12 కోట్ల రూపాయల నుంచి 13 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని ప్రచారం జరిగింది.

ఇంటర్వెల్ ట్విస్ట్ మినహా మిగతా సన్నివేశాలు ఆకట్టుకోలేకపోవడం సినిమాకు మైనస్ గా మారింది. తెలుగుతో పాటు హిందీలో కూడా ఖిలాడీ మూవీ రిలీజ్ కాగా హిందీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రభావం చూపలేదు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. మరోవైపు రవితేజ నటించిన రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా త్వరలో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

శరత్ మాండవ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దివ్యాంశ కౌశిక్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమాతోనైనా రవితేజ సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus