కియారా అద్వానీ పరిచయం అవసరం లేని పేరు. ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామ’ ‘గేమ్ ఛేంజర్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ సినిమాల్లో చాలా పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు.. బాలీవుడ్లో చేసే గ్లామర్ షో అంతా ఇంతా కాదు.
తన నెక్స్ట్ మూవీ ‘వార్ 2’ లో ఆమె నెక్స్ట్ లెవల్ గ్లామర్ షోతో ఆకర్షించేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాలో కియారా అద్వానీ టూ-పీస్ బికినీలో కనిపించి పెద్ద షాక్ ఇచ్చింది. అలాగే హృతిక్ రోషన్ తో ముద్దు సీన్స్ లో కూడా రెచ్చిపోయి నటించింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన గ్లింప్స్ లో ఎక్కువగా హైలెట్ అయ్యింది కియారానే అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇక కొన్ని గంటల క్రితం హృతిక్ రోషన్, కియారా అద్వానీలపై చిత్రీకరించిన లవ్ సాంగ్ ను విడుదల చేశారు. ఇందులో కియారా అద్వానీ 2 పీస్ బికినీ హాట్ టాపిక్ అయ్యింది. సినిమాకి కూడా ఇవి ప్రధాన ఆకర్షణగా మారుతుందని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే వార్ 2 ప్రమోషన్స్ లో ఈమె కనిపించే అవకాశాలు లేవు. ఎందుకంటే.. కియారా ఇటీవల తల్లయ్యింది. సో ప్రమోషన్స్ కి హాజరు కాలేదు. అయినప్పటికీ ప్రమోషన్స్ లో ఈమె బికినీ అంశంపై మాత్రం కచ్చితంగా ప్రశ్నల వర్షం కురిసే అవకాశం ఉంది.
ఇక అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ‘వార్ 2’ ఆగస్టు 14న రిలీజ్ కానుంది.