Kiara Advani: ‘నా ప్లేస్ లో హీరో ఉంటే ఇలా చేస్తారా..?’ కియారా ఫైర్!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా హవా బాగా పెరిగిపోయింది. ప్రతీ ఒక్కరూ ఇంటర్నెట్ ని బాగా వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వాడకం పెరగడంతో సెలబ్రిటీలకు, ఫ్యాన్స్ మధ్య దూరం బాగా తగ్గింది. ఈ క్రమంలో తమకు ఇష్టమైన హీరోహీరోయిన్లకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఆసాకుతో చూపిస్తున్నారు నెటిజన్లు. అదే సమయంలో నటీనటులు ఏ చిన్న పొరపాటు చేస్తూ కనిపించినా.. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హీరోయిన్ల విషయంలో ట్రోలింగ్ ఎఫెక్ట్ మరీ ఎక్కువగా ఉంటుంది.

ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. మొన్నామధ్య కియారా అద్వానీను కూడా బాగా ట్రోల్ చేశారు. ఈ విషయంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కియారా. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్లుగానే వీరిద్దరూ పలుమార్లు కలిసి బయటకు రావడం.. తిరగడం వంటివి చేస్తున్నారు. అయితే కొన్నిరోజుల క్రితం కియారా అద్వానీ.. సిద్ధార్థ్ అపార్ట్మెంట్ కు వెళ్లింది.

అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఆమె కార్ డోర్ తెరిచి సెల్యూట్ చేశాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సెక్యూరిటీ గార్డ్ వృద్ధుడు కావడంతో.. అతడితో కార్ డోర్ ఓపెన్ చేయించుకున్న కియారాను బాగా ట్రోల్ చేశారు. కారు డోరు కూడా తీసుకోవడం రాదా..? నీకంటే వయసులో పెద్దవారితో ఇలాంటి పనులు చేయించుకోవడానికి సిగ్గులేదా..? అంటూ ఆమెని చాలా మాటలు అన్నారు. దీనిపై స్పందించిన కియారా..

‘నా ప్లేస్ లో ఒక హీరో ఉండి ఉంటే ఇలాంటి కామెంట్స్ చేసేవాళ్లు కాదేమో.. అయినా ఎవరూ సెల్యూట్ చేయమని అడగరు. ఆయన సెక్యూరిటీ గార్డ్ కాబట్టి స్వతహాగా అలా చేశారు. కారులో నుంచి దిగుతుండగా.. ఫోటోగ్రాఫర్ వీడియోలు తీసి వైరల్ చేశారు. ఇది అనవసరమైన ట్రోలింగ్’ అంటూ చెప్పుకొచ్చింది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus