Kiara Advani: వార్ 2 కియరా బికినీ నిజం కాదా?

‘వార్ 2’ (War 2)  టీజర్ వచ్చినప్పటి నుంచీ సోషల్ మీడియాలో కియారా అద్వాణీ (Kiara Advani) లుక్ చర్చనీయాంశంగా మారింది. హృతిక్ రోషన్ (Hrithik Roshan)  , జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  , కియారా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ టీజర్‌లో కియారా బికినీ అవతారం నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తుండగా.. అదే సమయంలో అనుమానాలకూ దారి తీసింది. నియాన్ గ్రీన్ బికినీలో ఆమె కనిపించిన మూడుసెకన్ల సన్నివేశం టీజర్‌లో అత్యధికంగా షేర్ అవుతోంది. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఈ బికినీ లుక్‌పై డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు.

Kiara Advani

కియారా ముఖం స్పష్టంగా ఉన్నా, ఆమె బాడీ వాస్తవంగా అనిపించడంలేదంటూ వివిధ ఫోరమ్‌ల్లో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ లుక్ కృత్రిమంగా అనిపిస్తోందని, ఇది ఎడిటెడ్ ఫుటేజ్ అయి ఉండొచ్చని అంటున్నారు. రెడ్డిట్‌, ఎక్స్‌ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై “AI జనరేటెడ్ లుక్ కావచ్చేమో” అనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ డౌట్స్‌కు కారణం ఒక్కటే కాదు. ఇటీవలే బాలీవుడ్‌లో వాస్తవమైన ఫొటోలు, వీడియోలను కూడా AI ద్వారా మార్చే ట్రెండ్ బాగా పెరిగింది.

దీంతో కియారా లుక్‌పై కూడా అదే అనుమానం వ్యక్తమవుతోంది. నిజంగా ఆమె ఈ బికినీ లుక్‌లో నటించిందా? లేక ప్రొడక్షన్ టీమ్ ఏదైనా వర్చువల్ టెక్నాలజీ వాడిందా? అన్నది ప్రస్తుతం క్లారిటీ లేదు. అయితే, చిత్ర యూనిట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఇదిలా ఉంటే, కియారా లుక్ దీపికా పదుకొణె (Deepika Padukone) ‘పఠాన్’ సినిమాలోని బికినీ సీన్‌తో పోల్చుతూ నెటిజన్లు డిబేట్‌లో మునిగిపోయారు.

“దీపికా రియలిస్టిక్‌గా ఉంది, కియారా ప్యాచ్‌గా ఉంది” అనే కామెంట్లు కొంతమంది వినిపిస్తే, మరికొంత మంది మాత్రం “కియారా లుక్ అత్యంత స్టన్నింగ్” అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ వైరల్ సీన్ సినిమాకు మరింత హైప్‌ తెచ్చినప్పటికీ, టెక్నాలజీ నిజమే అయితే.. ప్రేక్షకుల అంచనాలపై ప్రభావం చూపొచ్చు.

పూనమ్ గురూజీని ఇప్పట్లో వదిలేలా లేదుగా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus