Kiara-Siddharth: పెళ్లి కోసం కియారా సిద్ధార్థ్ రోజుకు ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలుసా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు సినిమాలలో కలిసి నటించడమే కాకుండా నిజజీవితంలో కూడా ఒకరితో ఒకరు ప్రేమలో పడి వివాహాలు చేసుకున్నారు. ఇప్పటికే ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు వివాహం చేసుకొని సంతోషంగా జీవిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి మరో జంట చేరబోతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా మంచి గుర్తింపు పొందిన సిద్ధార్థ మల్హోత్రా కియారా, అద్వానీ త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కానున్నారు. ఇప్పటికే వీరి పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించారు.

చాలాకాలం డేటింగ్ లో ఉన్న వీళ్ళిద్దరూ ఎట్టకేలకు పెళ్లి చేసుకోవటానికి సిద్ధమయ్యారు. ఈ బాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లి వేడుక చాలా ఘనంగా జరగబోతోంది. ఫిబ్రవరి 4, 5, 6 తేదీలలో మూడు రోజులపాటు జరగబోయే ఈ పెళ్లి వేడుకలో మెహందీ, హల్దీ, సంగీత్ వంటి కార్యక్రమాలకు చాలా గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ సూర్యగఢ్ ప్యాలెస్ హోటల్‌ లో వీరి పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఎంతో ఘనంగా నిర్వహించబోతున్న ఈ పెళ్లి వేడుకకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లి ఖర్చు గురించిన వార్తలు ప్రస్తుతం బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి. ముంబైకి చెందిన ఓ వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరుగుతుండగా.. వీరి వివాహ వేడుకకు ఒక్కరోజుకే రూ.2 కోట్ల వరకు ఖర్చు అవుతుందని సమాచారం. ఇక మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ వివాహ వేడుకకు రూ.6 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

అంగరంగ వైభవంగా జరగబోతున్న వీరి వివాహానికి సినీ తారలతో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరవుతుండటంతో ఖర్చుకు ఏమాత్రం వెనకాడటం లేదని తెలుస్తోంది. అతిథుల కోసం ఏకంగా 70కి పైగా లగ్జీ కార్లను కూడా అందుబాటులో ఉంచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, ఆయన భార్య మీరా, కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా తదితరులు హాజరైనట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు జరిగిన ఖరీదైన వివాహ వేడుకల్లో సిద్ధార్థ్ – కియారా పెళ్లి కూడా ఒకటిగా నిలిచిపోనుందని తెలుస్తొంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus