Kiara ,Sidharth: భారీగా ఆస్తులు కూడ పెట్టిన సిద్ధార్థ్ మల్హోత్రా కియారా!

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా గుర్తింపు పొందిన కియార – సిద్దార్థ్ ఇటీవల వివాహబంధంతో ఒక్కటయ్యారు. చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న ఈ జంట ఇటీవల కుటుంబసభ్యుల అంగీకారంతో ఒక్కటయ్యారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి వీరి వివాహ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు. వీరి వివాహ వేడుకకు చేసిన ఖర్చు చూసి ఈ సందర్భంగా వీరి ఇరువురీ ఆస్తుల విలువ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చంశనీయంగా మారింది.

ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సిద్ధార్థ్ – కియారా ఉమ్మడి ఆస్తుల విలువ మొత్తం కలిపి రూ. 125 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. బాలీవుడ్ లో హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రాకు మంచి గుర్తింపు ఉంది. దీంతో సిద్దార్థ్ ఒక్కో సినిమాకు రూ.8 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం. ఇక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పాపులర్ అయిన కియారా అద్వానీ కూడా ఒక్కో సినిమాకి రూ.3 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక కియారాకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. రూ.1.56 కోట్ల విలువగల ఆడి A8L, మెర్సిడెస్ బెంజ్ ఇ క్లాజ్ రూ.72 లక్షలు, బీఎండబ్ల్యూ 530డీ రూ.68 లక్షలు, బీఎండబ్ల్యూ ఎక్స్5 ఎస్యూవీ రూ.98 లక్షలు విలువ గల లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆర్సీ15’లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ప్రస్తుతం రెండు రోజుల క్రితం జరిగిన కియార – సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జైపూర్ లో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహ వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఇక భరత్ అనే నేను సినిమా ద్వారా కియార తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. దీంతో టాలీవుడ్ సినీ సెలబ్రిటీలతో పాటు ప్రేక్షకులు కూడా వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus