ఈ వారం రీరీలీజ్ కానున్న సినిమాల బుకింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

  • February 27, 2024 / 10:34 AM IST

ఈ మధ్య కాలంలో అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలను రీరిలీజ్ చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. అయితే పది సినిమాలు రీరిలీజ్ అవుతుంటే ఒకటి రెండు సినిమాలకు మాత్రమే మంచి రెస్పాన్స్ వస్తోంది. స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అయితే మాత్రం బెటర్ రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం. ఈ వారం కిక్, సింహాద్రి, సమరసింహారెడ్డి సినిమాలు రీరిలీజ్ కానున్నాయి. ఈ మూడు సినిమాలు పరిమిత సంఖ్యలో టికెట్ రేట్లతో విడుదలవుతున్నాయి.

మూడు సినిమాలకు కొన్ని థియేటర్లలో అదిరిపోయే రేంజ్ లో బుకింగ్స్ జరుగుతుండగా మరికొన్ని థియేటర్లలో మాత్రం ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగడం లేదు. రీరిలీజ్ కలెక్షన్లను బట్టి ఈ సినిమాలలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో తేలుతుందని చెప్పవచ్చు. థియేటర్లలో రీరిలీజ్ సినిమాల గురించి మాట్లాడటానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మూడు సినిమాలు చెప్పుకోదగ్గ స్క్రీన్లలో రిలీజ్ అవుతుండటం గమనార్హం.

ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉంటే స్క్రీన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ఏరియాలలో మాత్రం రీరిలీజ్ సినిమాల బుకింగ్స్ ఇంకా మొదలుకాలేదు. మూడు సినిమాలు మంచి కలెక్షన్లను సాధించి మేకర్స్ కు మంచి లాభాలను అందించాలని నెటిజన్లు ఫీలవుతుండటం గమనార్హం. రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ సినిమాలు రీరిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది. అయితే రీరిలీజ్ సినిమాల వల్ల కొన్నిసార్లు స్ట్రెయిట్ సినిమాలపై కలెక్షన్ల విషయంలో ఎఫెక్ట్ పడుతుంది.

వాలంటైన్స్ డే కానుకగా విడుదలైన ఓయ్ సినిమా అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంది. కొన్ని క్రేజీ సినిమాల రీరిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమాల రీరిలీజ్ గురించి అప్ డేట్స్ రావాల్సి ఉంది. మరోవైపు రీరిలీజ్ సినిమాలకు సంబంధించి ఒక స్కామ్ కూడా నడుస్తోందని తెలుస్తోంది. కొన్ని థియేటర్ల యాజమాన్యాలు రీరిలీజ్ సినిమాల  (Kick)పైరెటెడ్ వెర్షన్లను ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus