King Of Kotha Collections: ‘కింగ్ ఆఫ్ కొత్త’ రెండు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..?

దుల్కర్‌ సల్మాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. ‘జీ స్టూడియోస్’, ‘వేఫేరర్ ఫిల్మ్స్’ బ్యానర్లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.అభిలాష్ జోషి దర్శకుడు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది.యాక్షన్ ఎపిసోడ్స్, కె.జి.ఎఫ్ రేంజ్ ఎలివేషన్స్ కూడా ఉంటాయనే భరోసా ఇచ్చింది.

అయితే ఆగస్టు 24న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప ఎమోషనల్ కనెక్టివిటీ లేదు అని ప్రేక్షకులు పెదవి విరిచారు. దీంతో ఓపెనింగ్స్ సో సో గానే నమోదయ్యాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.33 cr
సీడెడ్ 0.11 cr
ఆంధ్ర(టోటల్) 0.36 cr
ఏపీ + తెలంగాణ 0.80 cr

‘కింగ్ ఆఫ్ కొత్త’ (King Of Kotha) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.0.80 కోట్ల షేర్ ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.5.2 కోట్లు షేర్ ను రాబట్టాలి. నెగిటివ్ టాక్ వల్ల ఈ మూవీ ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేకపోతోంది.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus