Kirak Rp: జబర్దస్త్ రీఎంట్రీ గురించి కిర్రాక్ ఆర్పీ క్లారిటీ ఇదే!

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ షోకు దూరమైన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు తెగ వైరల్ అయ్యాయనే సంగతి తెలిసిందే. కిర్రాక్ ఆర్పీ చేసిన కామెంట్లు నూటికి నూరు శాతం నిజమేనని కొంతమంది వెల్లడించగా మరి కొందరు మాత్రం ఫుడ్ విషయంలో ఆర్పీ చేసిన కామెంట్లు కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. అయితే తాజాగా కిర్రాక్ ఆర్పీ “నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు” పేరుతో ఒక రెస్టారెంట్ ను ఓపెన్ చేయగా

ఈ రెస్టారెంట్ టర్నోవర్ రోజుకు 2 లక్షల రూపాయలు అని ఈ రెస్టారెంట్ ద్వారా ఆర్పీకి భారీ మొత్తంలో లాభాలు దక్కుతున్నాయని తెలుస్తోంది. హైదరాబాద్ లో మరిన్ని బ్రాంచ్ ల ఏర్పాటు దిశగా కిర్రాక్ ఆర్పీ అడుగులు వేస్తున్నారు. కిర్రాక్ ఆర్పీకి ఉన్న గుర్తింపు వల్ల కూడా బిజినెస్ లో ఆర్పీ సక్సెస్ అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇస్తారా అనే ప్రశ్నకు కిర్రాక్ ఆర్పీ మాత్రం ఆ షోలో తాను రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని కామెంట్లు చేశారు.

జబర్దస్త్ షోకు తాను వెళ్లనే వెళ్లనని ఆయన చెప్పుకొచ్చారు. జబర్దస్త్ లో తనకు అవమానం జరిగిందని అంత అవమానం జరిగిన తర్వాత రీఎంట్రీ ఇచ్చే అవకాశమే లేదని ఆర్పీ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. రాబోయే రోజుల్లో అర్పీ మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

జబర్దస్త్ కమెడియన్లలో చాలామంది కమెడియన్లు ఆ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుని ఇతర వ్యాపారాలలో ఆ షో ద్వారా వచ్చిన డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు. జబర్దస్త్ షో ఎంతోమంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ షోకు దూరమైన వాళ్లలో కొంతమంది కెరీర్ పరంగా సక్సెస్ అయితే మరి కొందరు కెరీర్ పరంగా ఫెయిల్ అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus