ఎలాంటి సపోర్టు లేకుండా, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లో హీరోగా రాణించడం కష్టం అని ఎవరైనా అన్నప్పుడల్లా.. ‘నేనున్నా.. నేను సాధిస్తా.. నేను సాధించాను’ అంటూ ఒక కుర్రాడు వస్తుంటాడు. అలా రీసెంట్ టైమ్స్‌లో వచ్చిన కథా‘నాయకుడు’ కిరణ్ అబ్బవరం. యూట్యూబ్ నుండి కిరణ్ ‘రాజా వారు రాణీగారు’తో సినిమాల్లోకి వచ్చాడు. ఆ తర్వాత ‘ఎస్ ఆర్ కల్యాణమండపం’ సినిమాతో నటుడిగానే కాకుండా, రచయితగానూ అదరగొట్టాడు. ఇప్పుడు ‘సమ్మతమే’ అంటూ ప్రేక్షకుల సమ్మతం కోసం త్వరలో వస్తున్నాడు.
ఈ నేపథ్యంలో తన లైఫ్ గురించి కొన్ని ఆసక్తికకర విషయాలు వెల్లడిచాడు. అందరికీ తెలిసినట్లు కిరణ్ అబ్బవరం బీటెక్ చదివాడు. సినిమాల్లోకి వచ్చేముందు బెంగళూరులో రూ. 70 వేల నెల జీతంలో ఉద్యోగం చేసేవాడు. అయితే సినిమాల మీద ఇష్టంతో ఆ ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వచ్చేశాడు. అయితే చదువుకునే సమయంలో కిరణ్‌ను వాళ్ల లెక్చరర్ ఒకరు.. ‘నువ్వు బస్టాండ్‌ల్లో బఠాణీలు అమ్ముకుంటావు’ అని అనే తిట్టేవారట. ఇక కాలేజీలో చదువుకునే రోజుల్లో చాలా లావుగా ఉండేవాడినని, ఓ అమ్మాయికి ఐ లవ్యూ చెబితే.
ఆమె భయపడి కాలేజీకి పది రోజులు సెలవు పెట్టేసింది అని చెప్పాడు కిరణ్ అబ్బవరం. అలాగే ‘ఎస్ ఆర్ కల్యాణ మండపం’ సినిమా షూటింగ్‌లో జిరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి కూడా చెప్పాడు కిరణ్. ఆ సినిమాలో కల్యాణమండపంలో ప్రఖ్యాత నటుడ ఎస్వీ రంగారావు ఫొటో ఉంటుంది మీరు చూసే ఉంటారు. ఓ రోజు ఆ ఫొటో దగ్గరకు కిరణ్, సాయికుమార్ వెళ్లి నమస్కారం పెట్టుకున్నారట.
ఆ సమయంలో అక్కడ ఎలాంటి గాలి లేకపోయినా.. ఫొటోకి వేసి ఉన్న దండ అలా మూడు సార్లు వచ్చి కిరణ్‌ను తాకిందట. అలా తమకు ఎస్వీఆర్ ఆశీస్సులు లభించాయని గొప్పగా చెప్పాడు కిరణ్. ఆ సినిమాలో హీరోయిన్‌తో ఉన్న సన్నివేశాలు.. తన నిజ జీవితంలో ఓ అమ్మాయితో చేద్దాం అనుకున్నవి అని చెబుతూ నవ్వేశాడు కిరణ్.