ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటిస్తూ హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటుడు కిరణ్ అవ్వడం ఒకరు. ఈయన ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈయన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయని చెప్పాలి. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి కిరణ్ అబ్బవరం తాజాగా అషు రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..
ఎన్నో విషయాలను ముఖ్యంగా తన సినీ కెరియర్ గురించి పలు విషయాలను తెలియచేశారు. ఈ క్రమంలోనే ఈయన తన సినిమాలలో రెమ్యూనరేషన్ కాకుండా సినిమాల ద్వారా వచ్చే లాభాలలో వాటా తీసుకుంటారంటూ ఇదివరకు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే ఈ విషయం గురించి ఈయన మాట్లాడుతూ క్లారిటీ వచ్చారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ అందరి హీరోలు మాదిరిగాను నేను మొదట్లోనే రెమ్యూనరేషన్ తీసుకోను.
సినిమా మొత్తం అయిపోయిన తర్వాత నిర్మాతలకు లాభాలు వస్తే అందులో నుంచి తాను రెమ్యూనరేషన్ గా తీసుకుంటానని ఈయన తెలియచేశారు. ఇక చాలామంది హీరోలు మొదట్లోనే రెమ్యూనరేషన్ తీసుకొని సినిమా పూర్తి చేయకుండానే తప్పుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల నిర్మాతలకు చాలా నష్టం వస్తుంది. నిర్మాతలు గురించి ఆలోచించి తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని ఈయన తెలియజేశారు.
ఇక ఈ విషయం గురించి (Kiran Abbavaram) కిరణ్ అబ్బవరం క్లారిటీ ఇవ్వడంతో ఈయన మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజానికి ఇలా సినిమా లాభాలలో వాటాలు పెద్ద హీరోలు మాత్రమే తీసుకుంటారు కానీ నిర్మాతల గురించి ఆలోచిస్తూ ఈయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎంతో సరైనదని భావిస్తున్నారు. ఇకపై తాను మంచి కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించాలని మాత్రమే నిర్ణయించుకున్నానని అందుకే ఒక ఆరు నెలలు లేదా ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నానంటూ ఈ సందర్భంగా తెలియజేశారు.
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!