‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. మొదటి సినిమాతో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు పొందాడు. అటు తర్వాత ‘ఎస్.ఆర్.కల్యాణ మండపం’ హైప్ కొద్దీ అది కూడా సక్సెస్ అయ్యింది. దీంతో అతనికి వరుస ఆఫర్లు లభించాయి. కానీ ‘సమ్మతమే’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి చిత్రాలు తప్ప.. మిగిలినవి అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ‘మీటర్’ `రూల్స్ రంజన్` రూపంలో కిరణ్ కి బ్యాక్ టు బ్యాక్ ప్లాపులు పడ్డాయి.
అయినప్పటికీ అతని చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అవి ఈ ఏడాదే రిలీజ్ అయ్యే ఛాన్స్ లు ఉన్నప్పటికీ.. కిరణ్ మాత్రం తొందరపడటం లేదు. అసలు ఈ ఏడాది ఆ సినిమాలను విడుదల చేసే ఆలోచనలో కూడా లేడు అని స్పష్టమవుతుంది. అలాగే కిరణ్ మైనస్ ఏంటి అంటే.. తన సినిమాలు ప్లాపైనా కూడా.. అవి ప్లాప్ అని యాక్సెప్ట్ చేయడు.
కానీ ఈసారి ‘రూల్స్ రంజన్’ ప్లాపైనా అతను దాని గురించి వెనకేసుకొచ్చే ప్రయత్నాలు చేయడం లేడు. ఆ విషయంలో కిరణ్ మంచి రూట్లోకి వచ్చినట్టే..! ఇక కిరణ్ చేతిలో ఉన్న మూడు ప్రాజెక్టులు కూడా వేటికవే ప్రత్యేకమైనవి. ఈ మూడింటిలో ఒకటి గీతా ఆర్ట్స్, మరొకటి యూవీ సంస్థల్లో కూడా చేస్తున్నట్టు వినికిడి. సుకుమార్ రైటింగ్స్ లో కూడా… కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఓ సినిమా చేసే ఛాన్సుంది. ఇవి కనుక హిట్ అయితే మళ్ళీ అతను రేస్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు