Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం స్ట్రాటజీ మామూలుగా లేదుగా..బ్లాక్ బస్టర్ మేకర్స్ తో సెట్ చేసుకున్నాడు..!

‘క’ (KA)  సినిమాకి ముందు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) వరుస ప్లాపులు ఫేస్ చేశాడు. ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ (Nenu Meeku Baaga Kavalsinavaadini) ‘మీటర్’ (Meter) ‘రూల్స్ రంజన్’ (Rules Ranjan)  వంటి చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్స్ అయ్యాయి. మధ్యలో ‘వినరో భాగ్యము విష్ణుకథ’  (Vinaro Bhagyamu Vishnu Katha) సినిమా పర్వాలేదు అనిపించినా.. అది కిరణ్ అబ్బవరం మార్కెట్ పెంచడానికి ఏమీ ఉపయోగపడలేదు. అయితే కొంత గ్యాప్ తీసుకుని చేసిన ‘క’ చిత్రం రూ.50 కోట్ల క్లబ్బులో చేరింది. ఈ సినిమాకి కిరణ్ అబ్బవరం కూడా ఒక నిర్మాత.

Kiran Abbavaram

అందుకే బడ్జెట్ శృతి మించకుండా చూసుకున్నాడు. ప్రమోషన్స్ బాగా చేశాడు. ఇవన్నీ సినిమాని బ్లాక్ బస్టర్ గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాయి అని చెప్పాలి. ‘క’ తర్వాత కిరణ్ అబ్బవరం ‘దిల్ రుబా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వాస్తవానికి ఇది ‘క’ కంటే ముందే ఫినిష్ అయ్యింది. కానీ ‘క’ కంటెంట్ పై నమ్మకం ఎక్కువగా ఉండటం..

దాని తర్వాత ‘దిల్ రుబా’ వస్తే మార్కెట్ పరంగా మంచి ఫలితం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ సినిమాని హోల్డ్ లో పెట్టాడు కిరణ్. వీటి తర్వాత చాలా మంది నిర్మాతల నుండి అడ్వాన్సులు వచ్చినప్పటికీ.. కిరణ్ తొందరపడటం లేదు. ఇలాంటి టైంలో కెరీర్ ను బాగా సెట్ చేసుకోవాలని భావిస్తున్నాడు. అందుకే మారుతి (Maruthi Dasari) , ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ (Sai Rajesh Neelam)..లతో చేతులు కలిపాడు. మారుతి రూ.250 కోట్ల బడ్జెట్ తో ‘రాజాసాబ్’ (The Rajasaab) సినిమా చేస్తున్నాడు.

ఎస్.కె.ఎన్ (Sreenivasa Kumar Naidu), సాయి రాజేష్..లు ‘బేబీ'(నాన్ థియేట్రికల్ రైట్స్ తో కలుపుకుని) (Baby) రూ.100 కోట్ల మార్క్ ను చూశారు. సో వీరి ‘మాస్ మూవీ మేకర్స్’ బ్యానర్లో కిరణ్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.దీంతో వంద కోట్లు క్లబ్లో చేరొచ్చు అనేది కిరణ్ స్ట్రాటజీ అని తెలుస్తుంది. మారుతి అసిస్టెంట్ అయినటువంటి ర‌వి ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తాడని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus