Kiran Abbavaram: బిగ్ బాస్ బ్యూటీ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కిరణ్ అబ్బవరం

ఈ సీజన్ బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఎంత హుషారుగా టాస్కులు ఆడుతున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. మొదటి ఎపిసోడ్ నుండే ఫైనల్స్ అన్నట్టుగా కసి గా ఆడడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పుడే నాలుగు వారాలు పూర్తి చేసుకొని 5 వ వారం లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ రియాలిటీ షో నుండి ఇప్పటి వరకు కిరణ్ , షకీలా, దామిని మరియు రతికా ఎలిమినేట్ అయ్యారు. రతికా ఎలిమినేట్ అవుతుందని ముందుగా ఎవ్వరూ ఊహించలేదు.

ఈమె ఎలిమినేషన్ కంటెస్టెంట్స్ కి మరియు ప్రేక్షకులకు పెద్ద షాక్. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ప్రతీ కంటెస్టెంట్ తో కన్నింగ్ గేమ్ ఆడుతూ వాళ్ళని ఏమార్చడం ఈమె హౌస్ లో అడుగుపెట్టిన రోజు నుండి చేస్తూనే ఉంది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ పైన ఈమె చేసిన టార్గెట్ చాలా చెత్తగా అనిపించింది. అందుకే నాలుగు వారాలకే బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చేసింది.

ఇది ఇలా ఉండగా అక్టోబర్ 6 వ తేదీన కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన ‘రూల్స్ రంజన్’ అనే చిత్రం విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం ట్విట్టర్ లో ఒక లైవ్ ఇంటరాక్షన్ ప్రోగ్రాం ని నిర్వహించాడు. ఈ ప్రోగ్రాం లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాదానాలు చెప్తూ వచ్చాడు కిరణ్ అబ్బవరం.

అయితే ఒక అభిమాని ‘అన్నా.. రూల్స్ రంజన్ సూపర్ హిట్ అయితే నీకు రతికా లాంటి అమ్మాయి పెళ్ళాం గా రావాలని కోరుకుంటాను’ అంటూ ఒక ట్వీట్ వేస్తాడు. దానికి కిరణ్ అబ్బవరం సమాధానం చెప్తూ ‘వామ్మో.. ఎందుకు తమ్ముడు నా మీద అంత పగ చెప్పు..?, చూద్దాం ఏ అమ్మాయి జీవితం లోకి వస్తుంది అనేది ఇప్పుడే చెప్పలేము కదా అని అంటాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనికి రతికా రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus