Pottel: ‘పొట్టేల్’ బాక్సాఫీస్.. ఇలా అయితే గట్టెక్కడం కష్టమే!

అనన్య నాగళ్ళ  (Ananya Nagalla)  లిప్ లాక్ ఇచ్చిన మొదటి సినిమా అంటూ ‘పొట్టేల్’ (Pottel) సినిమాకి పబ్లిసిటీ మొదలైంది. ఆ తర్వాత టీజర్, ట్రైలర్స్.. కంటెంట్ బాగుంటుందనే హోప్స్ ఇచ్చాయి. ముఖ్యంగా వాటిలో అజయ్ (Ajay) పాత్రకు సంబంధించిన విజువల్స్.. అనన్య నాగళ్ళ లిప్ లాక్ వీడియోని మరిపించాయి. ‘పొట్టేల్’ కి మరింత హైప్ తీసుకొచ్చాయి. నిన్న అంటే అక్టోబర్ 25 న ఈ సినిమా విడుదలైంది. అయితే కంటెంట్ పై నమ్మకంతో 2 రోజుల ముందు నుండే ప్రీమియర్స్ వేశారు.

Pottel

సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ గా స్పందించారు. ‘సినిమా టెక్నికల్ గా చాలా బాగుందని, క్లైమాక్స్ లో ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయని, మంచి మెసేజ్ కూడా ఉందని…ఈ వీకెండ్ కి కచ్చితంగా థియేటర్లలో చూడదగ్గ సినిమా అనే’ భరోసా ఇచ్చారు సినిమా చూసినవాళ్లు. అలా రిలీజ్ కి ముందే ‘పొట్టేల్’ హిట్ అనే కాన్ఫిడెన్స్ కూడా మేకర్స్ కి వచ్చింది. అయితే టాక్ అంత పాజిటివ్ గా వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్న స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు ఈ చిత్రం.

అందుతున్న సమాచారం ప్రకారం.. ‘పొట్టేల్’ చిత్రం బ్రేక్ ఈవెన్ కి రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ మొదటి రోజు(ప్రీమియర్స్) తో కూడా కలుపుకుని వరల్డ్ వైడ్ గా కేవలం రూ.22 లక్షల షేర్ ను మాత్రమే రాబట్టింది. రెండో రోజు కూడా పికప్ అయ్యింది అంటూ లేదు. వీకెండ్ కి గట్టిగా క్యాష్ చేసుకోకపోతే.. వీక్ డేస్ లో నిలబడటం కష్టమైపోతుంది. పైగా వచ్చేవారం ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) ‘క’  (KA) వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటి పక్కన థియేటర్స్ దొరకడం కూడా కష్టమైపోతుంది.

నీల్ – ఎన్టీఆర్ సినిమా.. ఆమె ఓ క్లారిటీ ఇచ్చేసింది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus