Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్  కెరీర్లో వెనుకబడ్డాడు. 2021 లో వచ్చిన ‘అల్లుడు అదుర్స్’ తర్వాత అతను హిందీ ‘ఛత్రపతి’కి టైం కేటాయించడం వల్ల.. తెలుగులో వెంటనే సినిమాలు చేయలేకపోయాడు. అది కూడా డిజాస్టర్ గా మిగిలింది. అటు తర్వాత కొంత గ్యాప్ తీసుకుని వరుస సినిమాలు మొదలుపెట్టాడు.ఈ క్రమంలో వచ్చిన ‘భైరవం’ పర్వాలేదు అనిపించింది కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

Kishkindhapuri

ఇప్పుడు ‘కిష్కింధపురి’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.’చావు కబురు చల్లగా’ అనే ఫిలాసఫికల్ మూవీ చేసిన కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో చేసిన హారర్ మూవీ ఇది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ‘భైరవం’ కంటే తక్కువ బడ్జెట్లోనే ఈ సినిమాని తీశారు. ఒకసారి థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం  3 cr
సీడెడ్  2 cr
ఆంధ్ర(టోటల్)  4 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)  9 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.50 cr
ఓవర్సీస్ 1.0 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 10.5 cr

‘కిష్కింధపురి’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.10.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాలి.పాజిటివ్ టాక్ కనుక వస్తే.. టార్గెట్ రీచ్ అవ్వడం చాలా ఈజీ అనే చెప్పాలి. లేదు అంటే పోటీగా ‘మిరాయ్’ కూడా ఉంది.

‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus