Kishkindhapuri Trailer: ‘కిష్కింధపురి’ ట్రైలర్ రివ్యూ

‘చావు కబురు చల్లగా’ అనే ఫిలాసఫికల్ మూవీతో దర్శకుడిగా డెబ్యూ ఇచ్చాడు కౌశిక్ పెగళ్ళపాటి. అయితే ఆ సినిమా అంతగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. 2వ సినిమా కోసం దాదాపు 3 ఏళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. మొత్తానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను ఒప్పించి ‘కిష్కింధపురి’ అనే హారర్ థ్రిల్లర్ మూవీని ఓకే చేయించుకున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఇందులో నాయికగా నటించింది.

Kishkindhapuri Trailer

‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నింటినీ ముగించుకుని ఈ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా పై కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. టీజర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. తాజాగా ట్రైలర్ ను కూడా వదిలారు.

2 నిమిషాల 14 నిమిషాల నిడివి కలిగిన ఈ ట్రైలర్.. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు హార్రర్ ఎలిమెంట్స్ తో నిండి ఉంది. ‘కిష్కింధపురి’ అనే ఒక ఊరు.. అక్కడి జనాలను పీడిస్తున్న ఆత్మలు, ప్రేతాత్మలు. మరోపక్క ఘోస్ట్ వీడియోలు చేసుకునే ఓ గ్యాంగ్.

దానికి చెందిన హీరో,హీరోయిన్. ఆ గ్యాంగ్ తో కలిసి దెయ్యాల బంగ్లాలు విజిట్ చేసే జనాలు. వీళ్లంతా కలిసి ‘సువర్ణ మాయ రేడియో స్టేషన్’ పాడుబడ్డ బంగ్లాకి వెళ్లడం.. అక్కడ వీరిని కొన్ని ఆత్మలు, ప్రేతాత్మలు బంధించడం.. ఆ తర్వాత ఏం జరిగింది?

అనే పాయింట్ ను రేకెత్తిస్తూ ట్రైలర్ ను కట్ చేశారు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హీరోయిన్ అనుపమ.. ఇద్దరూ కూడా ఆత్మలు ఆవహించినట్టు చూపించారు.

చేతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి. మీరు కూడా ఓ లుక్కేయండి :

నందమూరి ఫ్యామిలీకి దూరం.. తారకరత్న భార్య ఏమందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus