‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2: The Rule) నుంచి రీసెంట్‌గా విడుదలైన ‘కిస్సిక్’ పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. అల్లు అర్జున్ (Allu Arjun) , శ్రీలీల (Sreeleela) నటించిన ఈ సాంగ్, దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కంపోజ్ చేసిన మ్యూజిక్‌కి ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది. ఈ పాటలో ముఖ్యంగా ఆకట్టుకునే హస్కీ వాయిస్‌ను అందించిన సింగర్ సుభ్లాషిణి (Sublahshini) ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 24 ఏళ్ల ఈ యువ సింగర్ పేరు ఇప్పటి వరకు పెద్దగా హైలెట్ కాకపోయినా, ‘కిస్సిక్’ పాటతో ఒక్కసారిగా ఆమె పేరు మారుమ్రోగుతోంది.
కేవలం 24 గంటల్లోనే 42 మిలియన్ల వ్యూస్ సాధించి, ఇప్పటి వరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేసింది ఈ పాట. సంగీతంలో కొత్త సింగర్స్ ను ప్రోత్సహించడంలో దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన ప్రత్యేకతను నిరూపించారు. సుభ్లాషిణి గొంతు ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని ప్రతి ఒక్కరు అభిప్రాయపడుతున్నారు. సుభ్లాషిణి మ్యూజిక్ జర్నీ సోషల్ మీడియా ద్వారా మొదలైంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన మ్యూజికల్ టాలెంట్‌ను షేర్ చేస్తూ, మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
2020లో ఓ మ్యూజిక్ కంటెస్టు ద్వారా లైమ్‌లైట్‌లోకి వచ్చిన ఆమె, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ న్యూక్లియాతో కలిసి వర్క్ చేయడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ NEEK మూవీలో ఆమె ఆలపించిన ‘గోల్డెన్ స్పారో’ పాట కూడా విశేషమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. సుభ్లాషిణి వినూత్నమైన స్టైల్, డైనమిక్ వాయిస్‌తో త్వరలోనే మ్యూజిక్ ఇండస్ట్రీలో మరింత పేరు తెచ్చుకుంటుందనడంలో సందేహమే లేదు.
ఇలాంటి పాటలకు సరైన గొంతులను ఎంచుకోవడంలో దేవిశ్రీ ప్రసాద్‌కు ఉన్న ప్రత్యేకత మరొకసారి వెల్లడైంది. పాప్, మాస్ పాటలకు పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యే సుభ్లాషిణి గొంతు, పుష్ప 2 వంటి బిగ్ ప్రాజెక్ట్‌లో అవకాశం రావడం ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పుడు టాలీవుడ్‌లో కాకుండా ఇతర ఇండస్ట్రీలలోనూ సుభ్లాషిణి (Sublahshini) పాడే అవకాశాలు పెరుగుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.